చై-సామ్ జంటకు అభినందనల వెల్లువ
గత కొంతకాలంగా ప్రేమలో మునిగివున్న అక్కినేని నాగచైతన్య, సమంత నిశ్చితార్థం ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ‘ఎన్ కన్వెషన్ సెంటర్’లో జరిగిన ఈ వేడుక గురించి నాగార్జున ట్విట్టర్‌లో వెల్లడించారు. అందమైన ఈ జంట చూడముచ్చటైన ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.
సమంత క్రిస్టియన్ కాబట్టి... క్రైస్తవ సంప్రదాయంలోనూ, ఇటు అక్కినేని కుటుంబానికి తగ్గట్టు హిందూ సంప్రదాయంలోనూ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాబోయే భార్యకు చైతన్య ఉంగరం తొడిగి, ఆత్మీయంగా ముద్దాడారు. నవ్వుల్లో మునిగిన సమంత మురిసిపోయింది. వీరి నిశ్చితార్థం వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
Wishin u guys a lifetime of happiness n togetherness❤Many Congratulations @Samanthaprabhu2 n @Chay_akkineni #ChaiSam #MostAdorableCoupleEver pic.twitter.com/GBOUNMmFkO
— Pragya Jaiswal (@itsmepragya) 29 January 2017
అదేవిధంగా సమంత-నాగాచైతన్య జంటకు ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు చై-సామ్ జంటకు శుభాభినందనలు తెలిపారు. కలకాలం సంతోషంగా కలిసి జీవించాలని ఆకాక్షించారు.