డిసెంబరు 9న అఖిల్ నిశ్చితార్థం?
గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై స్పష్టత వచ్చేసింది. త్వరలో అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగబోతుంది. డిసెంబరు 9 వ తేదీన అఖిల్ నిశ్చితార్థం జరగనుందని నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక నాగచైతన్య వివాహానికి సంబంధించిన విషయాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండొచ్చని గురువారం వెల్లడించారు. కుమారుల వివాహాల విషయంలో పూర్తిగా నిర్ణయం వారిదేనని ఇదివరకే నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే.
చైతన్య.. సమంతతో ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం నాగార్జున క్లారిటీ ఇవ్వలేదు. ఇక అఖిల్ శ్రీయా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ను ప్రేమ వివాహం చేసుకోనున్నారని వినికిడి. మొత్తమ్మీద 2017లో అక్కినేని వాళ్లింట్లో పెళ్లిబాజాలు వినిపించనున్న విషయం మాత్రం దాదాపు స్పష్టమైపోయింది.