చైతూ తర్వాతే అఖిల్‌ పెళ్లి? | akhil marriage after naga chaitanya marriage | Sakshi
Sakshi News home page

చైతూ తర్వాతే అఖిల్‌ పెళ్లి?

Published Wed, Dec 28 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

చైతూ తర్వాతే అఖిల్‌ పెళ్లి?

చైతూ తర్వాతే అఖిల్‌ పెళ్లి?

అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్‌.. ఇద్దరిలో ముందు ఏడడుగులు వేసేది ఎవరంటే? అఖిల్‌ పేరు వినిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే... ఆల్రెడీ అఖిల్, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమంతతో ప్రేమలో ఉన్నానని చెప్పిన నాగచైతన్య, వచ్చే ఏడాది ఏడడుగులు వేస్తానని చెప్పారు. కానీ, ఎప్పుడనేది స్పష్టంగా చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం... ముందు చైతూ పెళ్లి, ఆ తర్వాతే అఖిల్‌ పెళ్లి జరిపించాలని నాగార్జున అనుకుంటున్నారట! జనవరి 29న చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. అక్కినేని ఫ్యామిలీ ఈ నిశ్చితార్థం వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. కొత్త కబురు ఏంటంటే... చైతూ, సమంతలు సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటు న్నారట.

 కానీ, విదేశాల్లో కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలని నాగార్జున కోరు కుంటున్నారట! అఖిల్‌–శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసింది. అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటే బాగుంటుందని నాగార్జున కోరిక అని సమాచారం. ముఖ్యంగా అఖిల్‌ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారట! ‘‘నా కంటే ముందు అఖిల్‌ పెళ్లి జరగడం హ్యాపీ. (నవ్వుతూ..) అందరి దృష్టి అఖిల్‌పై ఉంటుంది కదా! ఆ తర్వాత నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఇండియాలోనే పెళ్లి చేసుకుంటా. అయితే.. అది చెన్నైలోనా? హైదరాబాద్‌లోనా? అనడిగితే చెప్పలేను’’ అని ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్‌ టైమ్‌లో నాగచైతన్య చెప్పారు. కానీ, తండ్రి నాగార్జున కోరిక తెలిసిన తర్వాత చైతూ తన పెళ్లి ప్లాన్‌ మార్చుకుంటున్నారేమో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement