Shubhangi
-
మహారాష్ట్రలో పరువు హత్య
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వైద్య విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారంతో తమ పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను ఉరి వేసి చంపి, ఆపై దహనం చేశారు. లిబ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్) మూడో సంవత్సరం చదువుతున్న శుభాంగి జొగ్‌దండ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, తను గ్రామానికే చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని శుభాంగి వరుడికి తెలిపింది. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో పరువు పోయిందని కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 22 రాత్రి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబసభ్యులు కలిసి శుభాంగిని తమ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరివేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి, మిగిలిన ఆనవాళ్లను నీళ్లలో పడవేశారు. ఈ మేరకు ఐదుగురిపై హత్య, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
బంజారా భాషలో...
రమేష్ చౌహాన్, శుభాంగి జంటగా కపిల సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రాం నాయక్’. శ్రీ తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ పతాకంపై లక్ష్మీ చౌహాన్ నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్ చౌహాన్ మాట్లాడుతూ– ‘‘బంజారా భాషలో నిర్మించనున్న ఈ చిత్రంలో 5 పాటలు ఉంటాయి. సంగీత దర్శకుడు భోలే షావలి ఈ పాటలకు ప్రాణం పోశారు. చక్కటి కథతో కపిల సుబ్బారావు తెరకెక్కించనున్నారు’’ అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ చిత్రీకరించనున్నాం’’ అన్నారు కపిల సుబ్బారావు. ‘‘గతంలో సూపర్ హిట్ అయిన బంజారా చిత్రం ‘గోర్ జీవన్’ తర్వాత అంతగా మనసు లగ్నం చేసి ‘రాం నాయక్’ చిత్రానికి సంగీతం సమకూర్చాను. నాకు మంచి పేరు తీసుకువస్తుందనుకుంటున్నాను’’ అన్నారు భోలే షావలి. ఈ చిత్రానికి కెమెరా: శ్రావణ్ కుమార్. -
కామెడీ దెయ్యం కాదు
తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్, శుభాంగి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకాలపై క్రాంతికిరణ్ వెల్లంకి, వి.ప్రవీణ్ కుమార్ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వినోదం ఉండదు. కామెడీ దెయ్యం సినిమా కాదు. ఇది సస్పెన్స్ చిత్రం. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ఉంటుంది. కేశవ్‌గారి ద్వారా నాకు పరిచయమయిన క్రాంతిగారు చాలా సహకారం అందించారు’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి చిత్రం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు క్రాంతికిరణ్ వెల్లంకి. ‘‘సకల కళావల్లభుడు’ తర్వాత నేను నటించిన చిత్రమిది. ఇందులో థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు తనిష్క్‌రెడ్డి. ‘‘ఈ కథ విన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది’’ అని మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల. -
కమర్షియల్ టెంపర్
నవీన్, షాలినీ చౌహాన్ , శుభాంగి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షార్ట్ టెంపర్’. ప్రవీణా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాఘవ దర్శకత్వంలో ఎన్.ఆర్.ఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం హైదరాబాద్‌లో జరిగింది. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. రైటర్, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేశాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. హీరోగారు జిమ్‌లో 8 గంటలు కష్టపడుతున్నారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. కామెడీ టచ్ ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇందులో అలీగారు, ఆదిత్యా ఓమ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. బ్యాంకాక్‌లో షూట్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘రాఘవగారు కథ చెబుతున్నప్పుడే సినిమా చూసినట్టు అనిపించింది. బాగా డిజైన్ చే శారు’’ అన్నారు నవీన్. -
ప్రేమను నిరాకరించారని..
న్యూఢిల్లీ: తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఢిల్లీలో ఓ మహిళ షాపింగ్ మాల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ కమీషనర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సుభాంగి (21) బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని షాపింగ్ మాల్ దగ్గర తన ప్రేమికుడిని కలిసింది. 3:45 గంటల ప్రాంతంలో షాపింగ్ మాల్లో వాష్ రూంకు వెళ్లిన సుభాంగి, ఎంత సేపటికీ రాకపోవడంతో అతను ఆమె కోసం వెతికాడు. కిందకు వెళ్లి చూసే సరికి సుభాంగి రక్తమడుగులో పడి ఉంది. స్థానికుల సహాయంతో ఆమెను ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుభాంగి మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. స్థానికల సమాచారంతో అక్కడుకు చేరుకున్న పోలీసులు ముందుగా మృతురాలి ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్ లో ఉన్న సీసీ పుటేజీని స్వాధీనం చేసుకుని గమనించారు. పుటేజీలో ఆత్మహత్య లేఖ రాసి చెత్తకుండిలో పడి వేసిన దృశ్యాలను గమనించారు. చెత్తకుండి నుంచి లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో 'తన ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించటమే తన చావుకు కారణమని' రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.