ప్రేమను నిరాకరించారని.. | Woman leaves note in bin, hints she was upset with parents | Sakshi

ప్రేమను నిరాకరించారని..

Published Wed, Jan 4 2017 6:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ప్రేమను నిరాకరించారని.. - Sakshi

ప్రేమను నిరాకరించారని..

న్యూఢిల్లీ:
తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఢిల్లీలో ఓ మహిళ షాపింగ్ మాల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ కమీషనర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సుభాంగి (21) బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని షాపింగ్ మాల్ దగ్గర తన ప్రేమికుడిని కలిసింది. 3:45 గంటల ప్రాంతంలో షాపింగ్ మాల్లో వాష్ రూంకు వెళ్లిన సుభాంగి, ఎంత సేపటికీ రాకపోవడంతో అతను ఆమె కోసం వెతికాడు. కిందకు వెళ్లి చూసే సరికి సుభాంగి రక్తమడుగులో పడి ఉంది.

స్థానికుల సహాయంతో ఆమెను ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుభాంగి మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.  స్థానికల సమాచారంతో అక్కడుకు చేరుకున్న పోలీసులు ముందుగా మృతురాలి ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్ లో ఉన్న సీసీ పుటేజీని స్వాధీనం చేసుకుని గమనించారు.  పుటేజీలో ఆత్మహత్య లేఖ రాసి చెత్తకుండిలో పడి వేసిన దృశ్యాలను గమనించారు. చెత్తకుండి నుంచి లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో 'తన  ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించటమే తన చావుకు కారణమని' రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement