shyam k naidu
-
శ్యామ్ కే నాయుడిపై మోసం కేసు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుపై సినీ ఆర్టిస్ట్ సాయి సుధ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు శ్యామ్ కే నాయుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదేళ్ల నుంచి శ్యామ్‌తో సహజీవనం చేస్తున్నానని, ఈ విషయం శ్యామ్ సోదరుడు చోటా కే నాయుడికి తెలుసునని సాయిసుధ తెలిపారు. పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగితే తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. శ్యామ్‌తో తాను మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పి తనకు శ్యామ్ దగ్గరయ్యాడని అన్నారు. చాలాసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించినా తనను చోటా కే నాయుడు వారించారని, ఇప్పుడేమో కేసు పెట్టుకుంటే పెట్టుకో అంటున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాయి సుధ కోరారు. కాగా, పోకిరీ, దేశముదురు, సూపర్, బిజినెస్‌మాన్ తదితర సినిమాలకు శ్యామ్ కే నాయుడు కెమెరామన్‌గా పనిచేశారు. 2017లో టాలీవుడ్లో సంచలనం రేపిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేసులోనూ ఆయన పేరు వినిపించింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) అధికారులు 10 గంటలకు పైగా ఆయనను ప్రశ్నించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గుర్తింపు పొందిన సాయి సుధ.. విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’లో కీలకపాత్ర పోషించారు. (రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్) -
సిట్ విచారణకు హాజరైన శ్యామ్ కె నాయుడు
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు సిట్ ముందు హాజరయ్యారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించిన అధికారులు, ఆయన నుంచి పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పూరి అత్యంత సన్నిహితుల్లో శ్యామ్ కె నాయుడు ఒకరు. విచారణలో భాగంగా ఎన్నాళ్లు డ్రగ్స్ వాడుతున్నారు. మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. కెల్విన్‌తో పరిచయం ఎలా ఏర్పడింది.. లాంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించనున్నారు. -
షాకింగ్‌గా ఉంది: శ్యామ్ కే నాయుడు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు తెలిపారు. తనకు నోటీసులు వచ్చినట్టు వార్తలు రావడంతో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మీడియాలో వార్తలు చూస్తే షాకింగ్‌గా ఉందని పేర్కొన్నారు. తానేప్పుడు బయట కూడా ఎక్కువగా కనిపించనని, వార్తల్లో తన పేరు రావడం బాధగా ఉందన్నారు. ఇలాంటి ప్రచారంతో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వర్ధమాన హీరో తనీష్ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తమకు నోటీసులు అందాయని నవదీప్, సుబ్బరాజు తెలిపారు. డగ్స్ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. ఎందుకు నోటీసులు పంపించారో అర్థం కావడంలేదని సుబ్బరాజు అన్నారు.