
సిట్ విచారణకు హాజరైన శ్యామ్ కె నాయుడు
టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు సిట్ ముందు హాజరయ్యారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ను విచారించిన అధికారులు, ఆయన నుంచి పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పూరి అత్యంత సన్నిహితుల్లో శ్యామ్ కె నాయుడు ఒకరు. విచారణలో భాగంగా ఎన్నాళ్లు డ్రగ్స్ వాడుతున్నారు. మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. కెల్విన్తో పరిచయం ఎలా ఏర్పడింది.. లాంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించనున్నారు.