ఆ నగరం పేరు మార్చండి
లక్నో: అలహాబాద్‌కు కొత్త గుర్తింపు కోసం యూపీ సర్కార్ తహతహలాడుతోంది. అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌గా మార్చాలని కోరుతూ యూపీ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ గవర్నర్ రామ్ నాయక్‌కు లేఖ రాశారు. గతంలో మహారాష్ట్ర గవర్నర్‌గా రామ్ నాయక్ బొంబాయి పేరును ముంబైగా మార్చారని, ఇప్పుడు అదే తరహాలో అలహాబాద్ పేరును ప్రయాగ్‌గా మార్చేందుకు చొరవ చూపి తమకు సాయపడాలని లేఖ తాను కోరానని సింగ్ చెప్పారు. కాగా ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్ లేదా ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో యూపీ మం త్రి గవర్నర్‌కు లేఖ రాయడం గమనార్హం.
అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఈ ఏడాది మేలో కొందరు హిందూ సన్యాసులు అఖిల భారత అఖారా పరిషద్ ఆధ్వర్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం ఆమోదం తెలిపారు. దీనిపై తమ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను కేంద్రం ఆమోదం కోసం పంపుతుందని ఈ సందర్భంగా వారికి సీఎం హామీ ఇచ్చారు.1580లో మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగ పేరును అలహాబాద్‌గా మార్చినట్టు చరిత్రకారులు చెబుతారు.