జనసేన.. బీజేపీతో జతకట్టలేదు | janasena only support bjp, says siddarthnath singh | Sakshi
Sakshi News home page

జనసేన.. బీజేపీతో జతకట్టలేదు

Published Wed, Nov 2 2016 11:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

జనసేన.. బీజేపీతో జతకట్టలేదు - Sakshi

జనసేన.. బీజేపీతో జతకట్టలేదు

విజయవాడ: ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన .. బీజేపీతో జతకట్టలేదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ చెప్పారు. ఎన్నికల సమయంలో జనసేన తమ పార్టీకి మద్దతు మాత్రమే తెలిపిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో తమకు ఎలాంటి విభేదాలూ లేవని తెలిపారు.

ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నట్టు సిద్ధార్థ్నాథ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్టులను కాపాడుతోందని ఆరోపించారు. ఆ పార్టీలో చేరేందుకు ఉగ్రవాదులు జైల్లో నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. భోపాల్ ఎన్కౌంటర్ను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement