'పవన్ అవకాశవాది.. పార్ట్‌టైం లీడర్' | pawan kalyan is twitter tiger alleges krishna sagar rao | Sakshi
Sakshi News home page

'పవన్ అవకాశవాది.. పార్ట్‌టైం లీడర్'

Published Fri, Jan 27 2017 6:49 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'పవన్ అవకాశవాది.. పార్ట్‌టైం లీడర్' - Sakshi

'పవన్ అవకాశవాది.. పార్ట్‌టైం లీడర్'

హైదరాబాద్‌: సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. పవన్‌ రాజకీయ అవకాశవాది అని, ట్విట్టర్‌ టైగర్‌ అంటూ బీజేపీ నేతలు అభివర్ణించారు. బీజేపీ అగ్రనాయకత్వంపై పవన్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులపై జనసేన నేత పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పరిపక్వత లేనివని కొట్టిపారేసింది.

 

పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేనివారే అటువంటి ఆరోపణలు చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ట్విట్టర్‌ల ద్వారా మాత్రమే పనిచేసే పవన్‌ కల్యాణ్‌.. ఒక పార్ట్‌టైం రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement