కారు బోల్తా : ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
హైదరాబాద్:
కారు బోల్తా పడడంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కోంపల్లిలోని పేట్ జహీరాబాద్ పోలీస్స్టేషన్ ఎదురుగా జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు కారులో మేడిచర్ల నుంచి హైదరాబాద్కు బయల్దేరారు.
ఈక్రమంలో పేట్ జహీరాబాద్ పోలీస్స్టేషన్ ఎదురుగా కారు బోల్తా పడడంతో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న లగిశెట్టి అనిల్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సాయికృష్ణ, సుమన్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న రిషప్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక బాలాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.