నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ
గత మూడురోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో రైతాంగం విలవిలలాడుతోంది. పంట నష్టంతోపాటు పండ్ల తోటలు కూడా దెబ్బతిని కోలుకోలేని స్థితిలోఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బైఎస్సార్ సీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు సిద్దార్థరెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.