Sight Defects
-
దృష్టిలోపం ఉన్నవారు డాక్టర్లు కావచ్చా?
న్యూఢిల్లీ: నయం కాని దృష్టిలోపంతో బాధపడుతున్నవారిని ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు, రోగులకు చికిత్స చేయడానికి అనుమతించవచ్చా? అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్‌కు నోటీసులు జారీ చేసింది. దృష్టిలోపంతో బాధపడుతున్న తనకు వైకల్య ధృవీకరణ పత్రం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ విద్యార్థి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. తాను నీట్ రాశానని, సర్టిఫికెట్ మంజూరు చేస్తే వికలాంగ కోటాలో ఎంబీబీఎస్‌లో చేరుతానని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. ‘టీచింగ్, న్యాయ తదితర రంగాల్లో దృష్టిలోపం ఉన్న వారు రాణించవచ్చంటే అర్థం చేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌కు ఇది ఎంతవరకు సమంజసమో పరిశీలించాల్సి ఉంది’ అని పేర్కొంది. -
టీనేజర్లలో దృష్టి లోపాలు ఎక్కువ
ఇరవయ్యేళ్ల లోపు వారిలో ఇటీవలి కాలంలో దృష్టి లోపాలు గణనీయంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణా సియా, అమెరికా, బ్రిటన్ ప్రాంతాల్లో ఇరవయ్యేళ్ల లోపు టీనేజర్లలో చాలామంది హ్రస్వదృష్టితో బాధపడుతు న్నారు. దశాబ్దం కిందటితో పోలిస్తే ఇటీవల ఈ దేశా లలో హ్రస్వదృష్టితో బాధపడుతున్న టీనేజర్ల సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశో ధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జీవన శైలిలో మార్పుల వల్లే టీనేజర్లు హ్రస్వదృష్టితో బాధపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. గంటల తరబడి టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు గడపడం, ఆరుబయట గడిపేందుకు సమయం చిక్కక పోవడం, చదువుల ఒత్తిడి విపరీతంగా పెరగడం వల్ల టీనేజర్ల చూపు మందగిస్తోందని అంటున్నారు.