టీనేజర్లలో దృష్టి లోపాలు ఎక్కువ
ఇరవయ్యేళ్ల లోపు వారిలో ఇటీవలి కాలంలో దృష్టి లోపాలు గణనీయంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణా సియా, అమెరికా, బ్రిటన్ ప్రాంతాల్లో ఇరవయ్యేళ్ల లోపు టీనేజర్లలో చాలామంది హ్రస్వదృష్టితో బాధపడుతు న్నారు. దశాబ్దం కిందటితో పోలిస్తే ఇటీవల ఈ దేశా లలో హ్రస్వదృష్టితో బాధపడుతున్న టీనేజర్ల సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశో ధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
జీవన శైలిలో మార్పుల వల్లే టీనేజర్లు హ్రస్వదృష్టితో బాధపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. గంటల తరబడి టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు గడపడం, ఆరుబయట గడిపేందుకు సమయం చిక్కక పోవడం, చదువుల ఒత్తిడి విపరీతంగా పెరగడం వల్ల టీనేజర్ల చూపు మందగిస్తోందని అంటున్నారు.