
న్యూఢిల్లీ: నయం కాని దృష్టిలోపంతో బాధపడుతున్నవారిని ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు, రోగులకు చికిత్స చేయడానికి అనుమతించవచ్చా? అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్‌కు నోటీసులు జారీ చేసింది. దృష్టిలోపంతో బాధపడుతున్న తనకు వైకల్య ధృవీకరణ పత్రం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ విద్యార్థి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు.
తాను నీట్ రాశానని, సర్టిఫికెట్ మంజూరు చేస్తే వికలాంగ కోటాలో ఎంబీబీఎస్‌లో చేరుతానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. ‘టీచింగ్, న్యాయ తదితర రంగాల్లో దృష్టిలోపం ఉన్న వారు రాణించవచ్చంటే అర్థం చేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌కు ఇది ఎంతవరకు సమంజసమో పరిశీలించాల్సి ఉంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment