Silicon Valley Bank
-
అమెరికా బ్యాంకింగ్ కుప్పకూలడానికి అక్కడ విధానాలే కారణం
-
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్‌లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
ఫస్ట్ సిటిజన్స్ చేతికి ఎస్వీబీ
న్యూయార్క్: సంక్షోభంతో మూతబడిన సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) సింహభాగం కార్యకలాపాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ దక్కించుకుంది. దీంతో ఎస్‌వీబీకి చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ అండ్ ట్రస్టుకు బదిలీ అవుతాయి. ఎస్వీబీ కస్టమర్లు ఆటోమేటిక్‌గా ఫస్ట్ సిటిజన్స్ ఖాతాదారులుగా మారతారని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) తెలిపింది. ఫస్ట్ సిటిజన్స్‌లో ఎఫ్‌డీఐసీకి 500 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు దక్కుతాయి. ఎస్‌వీబీకి చెందిన 167 బిలియన్ డాలర్ల అసెట్లలో 90 బిలియన్ డాలర్ల అసెట్లు ఎఫ్‌డీఐసీ వద్దే ఉంటాయి. 72 బిలియన్ డాలర్ల అసెట్లు, ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్‌కు భారీ డిస్కౌంటుపై 16.5 బిలియన్ డాలర్లకు దక్కుతాయి. ఎస్వీబీ వైఫల్యంతో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడనుంది. ఎస్వీబీ దెబ్బతో కుదేలైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు అమెరికాలోని 11 భారీ బ్యాంకులు దాదాపు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించాయి. 1898లో ఏర్పాటైన ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ .. నార్త్ కరోలినాలోని రాలీ ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 100 బిలియన్ డాలర్ల పైచిలుకు అసెట్లతో 21 రాష్ట్రాల్లో 500 శాఖలు ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై అనుమానాలతో ఖాతాదారులు తమ డిపాజిట్లను భారీగా వెనక్కి తీసుకుంటూ ఉండటంతో మార్చి 10న ఎస్వీబీ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు సిగ్నేచర్ బ్యాంక్ కూడా మూతబడింది. -
ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్‌లపై ప్రభావం పడలేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సత్వరం పూనుకుని చర్యలు తీసుకోవడం వల్ల సిలికాన్ వేలీ బ్యాంకు (ఎస్వీబీ) సంక్షోభ ప్రభావాలు దేశీ స్టార్టప్‌లపై పడలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. ఇండియా గ్లోబల్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎస్వీబీ కుప్పకూలినప్పుడు.. అందులో నిధులు ఉన్న భారతీయ స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. అది చిన్నపాటి సంక్షోభమైనప్పటికీ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క అంకుర సంస్థపైనా ప్రతికూల ప్రభావం పడకుండా .. మొత్తం ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేసిందని వైష్ణవ్ చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా మాత్రమే ఉన్న భారత్.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌లో ముందుకు పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు చాలా మటుకు అంతర్జాతీయ డెవలపర్లు భారత స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను తమ భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నారని మంత్రి వివరించారు. భారత్ కూడా చాట్‌జీపీటీ లాంటివి తయారు చేయగలదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మరికొద్ది వారాలు ఆగండి. ఒక భారీ ప్రకటన ఉండబోతోంది‘ అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఎకానమీకి భారత్ వంటి విశ్వసనీయ భాగస్వామి చాలా అవసరమని వైష్ణవ్ పేర్కొన్నారు. క్వాంటమ్ ఆధారిత టెలికం నెట్వర్క్ .. దేశీయంగా తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత సురక్షితమైన టెలికం నెట్వర్క్ లింక్ ప్రస్తుతం న్యూఢిల్లీ సీజీవో కాంప్లెక్స్‌లోని సంచార్ భవన్, ఎన్ఐసీ మధ్య అందుబాటులోకి వచ్చిందని వైష్ణవ్ చెప్పారు. ఈ వ్యవస్థ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయగలిగే ఎథికల్ హ్యాకర్లకు రూ. 10 లక్షల బహుమతి ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సీ–డాట్ రూపొందించినట్లు మంత్రి వివరించారు. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది. ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులు, డిపాజిట్లను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా ఆర్థిక పరిస్థితి. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కోవిడ్ మరణాల నమోదుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో కుదుట పడింది. అంతలోనే బ్యాంకుల దివాలా రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది కాలంలో తొమ్మిది సార్లు (మార్చి 22 నాటికి ) వడ్డీ రేట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపుతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకులకు నష్టాలు చుట్టుముట్టడంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) రంగంలోకి దిగింది. ఆ రెండు బ్యాంకులను మూసివేసి తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన డిపాజిట్లు, రుణాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. తద్వారా నేటి నుంచి ఎస్వీబీ డిపాజిటర్లంతా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఖాతాదారులుగా మారనున్నారు. కాగా, ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు 2023 మార్చి 10 నాటికి 167 బిలియన్ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలులో 72 బిలియన్ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్ డాలర్ల రాయితీతో ఫస్ట్ సిటిజిన్ బ్యాంక్ సొంతం చేసుకుంది. -
బ్యాంకింగ్ సంక్షోభం నేర్పే పాఠాలు
ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కొన్ని బ్యాంకుల సంక్షోభం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ బ్యాంకుల సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం గమనార్హం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నా రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసుల విషయంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలన్నది ఈ సంక్షోభం చెబుతున్న ఒక పాఠం. పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదన్నది మరో పాఠం. సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్వీస్... ఇటీవలి కాలంలో పత్రికల పతాక శీర్షికలకు ఎక్కిన బ్యాంకుల పేర్లు. భారత్‌లో క్రెడిట్ స్వీస్ గురించి చాలామందికి తెలుసు కానీ... మిగిలిన మూడింటితో పరిచయం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇవి ప్రధానంగా అమెరికాలో పనిచేసే బ్యాంకులు. అయినాసరే, వీటి గురించి బోలె డన్ని కథనాలు వరుసగా వస్తూండటం కొంత అసౌకర్యంగా అనిపించే విషయమే. ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, మన బ్యాంకింగ వ్యవస్థఎంత సురక్షితం? అన్నది. అమెరికాకు చెందిన లేహ్మ¯Œ బ్రదర్స్ దివాళా సంక్షోభం తరువాత ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ మూలధనానికి సంబంధించిన విధానాలను మరింత కఠినం చేసింది. బేసెల్ కమిటీ మార్గదర్శకాలు ఇందుకు కారణమయ్యాయి. అయినా ప్రస్తుత సంక్షోభాన్ని అది నివారించలేక పోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న తలెత్తుతోంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? లేక ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అయితే, ఈ బ్యాంకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దేని కారణాలు దానివే! ఈ మూడు బ్యాంకుల మూసివేతకూ, భారతీయ బ్యాంకులకూ నేరుగా సంబంధం లేకపోవచ్చు. సిల్వర్‌గేట్ బ్యాంకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి అంత ఆదరణ లేదు. ఇంకొన్నేళ్లు పోతే అసలు క్రిప్టో అన్న పదం కూడా వినిపించకపోవచ్చు. అదంత సుస్థిరమైంది కాదని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కేవలం స్టార్టప్‌లపైనే ఎక్కువగా కేంద్రీ కరించింది. అందిన డిపాజిట్లు అత్యధికం స్టార్టప్‌ల నుంచి వచ్చినవే. కొంతమేరకు అప్పులూ ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం ప్రభుత్వాలకు అప్పు ఇచ్చింది. (మన బ్యాంకుల మాదిరిగానే ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారన్నమాట.) ఇక సిగ్నేచర్ బ్యాంకు గురించి: ఇది అటు క్రిప్టో, ఇటు స్టార్టప్‌లు రెండు రంగాల్లోనూ పనిచేస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆదుకునేందుకు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యా¯Œ కార్ప్ ఒక ప్రయత్నం చేస్తోంది. చివరగా క్రెడిట్ స్వీస్: ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఎవరికి రుణా లిచ్చారన్న విషయంలో ఈ బ్యాంకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదు ర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్ అవుట్ ఇస్తోంది. అలాగే యూబీఎస్ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వేటికవే ప్రత్యేకం కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేవి. లేహ్మన్ బ్రదర్స్ సంక్షోభం కంటే ప్రస్తుత సంక్షోభం భిన్నమైంది. ఎలాగంటే... ఇప్పుడు అన్ని నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్బీఐ కూడా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందన్న భరోసా ఇచ్చింది. యూరప్‌లోనూ కేంద్ర బ్యాంకులు క్రెడిట్ స్వీస్ సంక్షోభం ప్రభావాన్ని మదిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ప్రభావం భారత్‌పై ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన గుణపాఠా లేమిటి? అప్పుల గురించి కూడా యోచించాలి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం నేర్పించే మొదటి పాఠం... కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలని! రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముప్పు ఒక్క దగ్గర పోగు పడకుండా చూడటం వీటి ఉద్దేశం. అయితే డిపాజిట్లు పోగుపడటం వల్ల కూడా ముప్పు ఉంటుందన్నది వినూత్నమైన విషయం. డిపా జిట్లు ఎక్కువగా స్టార్టప్‌ల నుంచి రావడం వల్ల సంక్షోభం మరింత ముదిరింది. ఎందుకంటే డిపాజిట్లు చేసిన వారందరూ అకస్మాత్తుగా వాటిని ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు. భారతీయ బ్యాంకులు ఈ విషయమై ఆలోచన చేయాలి. చిన్న బ్యాంకులు మరీ ముఖ్యంగా. ఇక రెండో గుణపాఠం: పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదని చెబుతోంది. యూఎస్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉండటం వాస్తవానికి చాలా సురక్షితం. కానీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ పెట్టుబడుల విలువల్లో తేడాలొస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకులు గుర్తించాలి. రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసెస్‌లను సమీక్షించుకోవాలి. ముచ్చటగా మూడో పాఠం: వాణిజ్య బ్యాంకింగ్‌లో నైపుణ్యం సాధించాలని బ్యాంకులకు తరచూ చెబుతూంటారు. ఇతర కార్య కలాపాలను అనుబంధ కంపెనీల ద్వారా నడపాలనీ, వాటి మూల ధన నిర్మాణం కూడా వేరుగా ఉండాలనీ అంటారు. క్రెడిట్ స్వీస్ విషయంలో ఈ రెండు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో వచ్చిన నష్టాలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగపు నిధులను విత్‌డ్రా చేయడం కాస్తా వాణిజ్య బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపింది. భారత్‌లో ఈ బలహీనతను చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఇన్వెస్ట్మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇన్సూరె¯Œ ్స, మ్యూచు వల్ ఫండ్స్ తదితరాలను అనుబంధ సంస్థల ద్వారా నడుపుతున్నారు. దీనివల్ల ముప్పు కొంచెం తక్కువవుతుంది. క్రిప్టో కరెన్సీని ఎలాగూ భారత్ గుర్తించలేదు. కాబట్టి రెండు బ్యాంకులు కుప్పకూలడం తాలూకూ ప్రభావం మనపై ఉండదు. వాస్తవానికి తాజా సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలను బ్యాంకింగ్‌కు దూరంగా ఉంచాలన్న అభి ప్రాయం బలపడటం గుర్తించాలి. ప్రత్యక్ష ప్రభావం లేదు అమెరికన్ బ్యాంకులు, క్రెడిట్ స్వీస్ సంక్షోభం తాలూకూ ప్రత్యక్ష ప్రభావం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఒక్కసారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. బ్యాలెన్స్ షీట్లను ఒక్కసారి పరిశీలించుకుని డిపాజిట్లు, అప్పులు ఎలా విభజితమై ఉన్నాయో చూసుకోవడం మేలు. ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా రిస్క్ టీమ్స్‌తో కలిసి పెట్టుబడుల తీరు తెన్నులను మదింపు చేయాలి. అంతేకాకుండా... డెట్(రుణ) సర్వీస్ కవరేజి నిష్పత్తికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఇది నిరంతర ప్రక్రియలా సాగాలి. ఆర్బీఐ కూడా డిపాజిట్లపై ప్రస్తుతం జారీ చేస్తున్న ఇన్సూరెన్స్‌ను సమీక్షించాల్సిన అవసరముంది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఐదు లక్షల గరిష్ఠ ఇన్సూరెన్స్ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలి. ముప్పు తీవ్రత ఆధారంగా బ్యాంకులను వర్గీకరించే అంశాన్నీ పరిశీలించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదు ర్కొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై త్వరలోనే చర్చ మొదలు కావచ్చు. ‘బేసిల్–4’ (సంస్కరణల కోసం) వంటివి ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఇది బ్యాంకులకు అవసరమైన మూలధనం మరింత పెరిగేందుకు దారితీసే అవకాశముంది. అంతేకాకుండా... మార్కెట్, క్రెడిట్ రిస్క్‌లను అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షల్లాంటివి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మదన్ సబ్నవీస్, వ్యాసకర్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్, (‘ద బిజినెస్ లైన్’ సౌజన్యంతో). -
బంగారం డిమాండ్‌కు ధరల మంట
న్యూఢిల్లీ: బంగారానికి డిమాండ్ గడిచిన 10 రోజుల్లో పడిపోయింది. ఏకంగా 40 శాతం క్షీణించినట్టు ఉత్తరాది ఆభరణాల వర్తకులు చెబుతుంటే, దేశంలో బంగారం అత్యధికంగా అమ్ముడుపోయే దక్షిణాదిన గడిచిన రెండు వారాల్లో డిమాండ్ 60 శాతం తగ్గిపోయినట్టు ఈ ప్రాంత వర్తకులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం జీఎస్టీతో కలిపి రూ.60,000కు చేరుకోవడమే డిమాండ్ పడిపోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ మొదలవుతుందని, ఇలాంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకు సంక్షోభాలతో పాశ్చాత్య దేశాల వృద్ధిపై ప్రభావం పడుతుందని, ఆర్బీఐ రేట్ల పెంపును తగ్గించొచ్చని, లేదంటే విరామం ఇవ్వొచ్చని, ఇది మార్కెట్లో నగదు లభ్యతను పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతునిచ్చినట్టు తెలిపారు. అస్థిరతలకు అవకాశం.. ‘‘బంగారం ధరల్లో సమీప కాలంలో అస్థిరతలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు)కు 2,020 డాలర్లకు, దేశీయంగా రూ.60,500కు చేరుకోవచ్చు’’అని కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా తెలిపారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ‘‘బంగారానికి డిమాండ్ స్తబ్దుగా ఉంది. కొనుగోళ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వేచి చూస్తోంది’’అని చెప్పారు. గడిచిన వారంలో బంగారం ధరలు ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగినట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సియమ్ మెహ్రా తెలిపారు. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ‘‘గత 10–15 రోజుల్లో డిమాండ్ 40 శాతం తగ్గింది. మరో 15 రోజుల్లో వివాహాల సీజన్ మొదలవుతున్నప్పటికీ, వేచి చూసే ధోరణితో ప్రజలు ఉన్నారు’’అని మెహ్రా వివరించారు. సీజ్ చేసిన స్మగుల్డ్ బంగారం @ 3,502 కేజీలు 2022లో 47 శాతం అప్ స్మగ్లింగ్‌లో పట్టుబడి, ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసిన బంగారం పరిమాణం గతేడాది 3,502 కేజీలుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 47 శాతం అధికం. కేరళలో అత్యధికంగా 755.81 కేజీల బంగారం పట్టుబడింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (535.65 కేజీలు), తమిళనాడు (519 కేజీలు) ఉన్నాయి. రాజ్యసభకు ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం .. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కేజీలు, అంతక్రితం ఏడాది 2,154.58 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది (2023) తొలి మూడు నెలల్లో 916.37 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని సీజ్ చేశాయి. 2021లో 2,445 పసిడి స్మగ్లింగ్ కేసులు, 2022లో 3,982 కేసులు నమోదయ్యాయి. బంగారం వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడంతో పసిడి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కస్టమ్స్ సుంకం రేటు 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం, ఐజీఎస్టీ రేటు 3 శాతం మొదలైనవన్నీ కలిపితే దిగుమతులపై పన్నుల భారం అధికంగా ఉంటోంది. దీనితో అక్రమ మార్గాల్లో కూడా దేశంలోకి పసిడి వస్తోంది. దీన్ని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇతరత్రా ఏజెన్సీలతో కలిసి నిరంతరం నిఘాను పటిష్టం చేస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనుసరించే కొత్త విధానాలను పసిగట్టి ఏజెన్సీలను అప్రమత్తం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. -
ఒక్క బ్యాంక్ కోసం ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. కారణం అదేనా
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత తర్వాత మరిన్ని బ్యాంక్‌లు అదే దారిలో ఉన్నాయనే వార్తలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. డిసెంబరు 31 నాటికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, కుప్పుకూలిపోతున్న బ్యాంకులు, విశ్లేషకుల అంచనాలు, ఇతర పరిణామాలతో ఖాతాదారులు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సదరు బ్యాంక్‌లో నగదు సమస్య ఏర్పడి బ్యాంక్ దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రుయిస్ట్, యూఎస్ బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. ఖాతాదారులందరూ బిలియనీర్లే ఇక ఫస్ట్ రిపబ్లిక్లో ఎక్కువ మంది బిలియనీర్లే ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారిలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఈ బ్యాంకు నుంచి తనఖా రుణం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో!
అమెరికా బ్యాకింగ్ రంగంలో సంక్షోభం నెలకొంది. రెండ్రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు మూతపడ్డాయి. ముందుగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) చేతులెత్తేస్తే..ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ చాపచుట్టేసింది. దీంతో వేలాది కంపెనీలు, లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఆ సంస్థ మాజీ సీఈవో గ్రెగ్ బెకర్ భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతం ఓ దీవిలో తన భార్యతో ఎంజాయి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి పారిపోయాడు న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..ఎస్వీబీ దివాళాతో గ్రెగ్ బెక్, తన భార్య మార్లిన్ బటిస్టాతో కలిసి హవాయీ ఐస్లాండ్ దీవిలోని మాయి అనే ప్రాంత 3.1 బిలియ్ డాలర్ల విలువైన టౌన్ హౌస్‌కి పారిపోయాడు. గ్రెగ్ బెక్ దంపతులు సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి హవాయికి ఈ జంట ఫస్ట్ క్లాస్ విమానంలో హవాయీ వెళ్లారు. అక్కడ లిమో(limo ride) రైడ్ చేసినట్లు, లహైన (Lahaina) ప్రాంతంలో సేద తీరే ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఎస్వీబీ దివాళాకు రెండు వారాల ముందు ఫెడరల్ రెగ్యులేటర్లు ఎస్వీబీని మూసివేయడానికి రెండు వారాల ముందు 3 మిలియన్ డాలర్ల విలువైన తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోన్ అధికారి నుంచి సీఈవోగా ఎస్వీబీ వెబ్సైట్ ప్రకారం..గ్రెగ్ బెక్ మూడు దశాబ్దాల క్రితం అంటే 1993లో సిలికాన్ వ్యాలీ బ్యాంకులో లోన్ అధికారిగా చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ ఇన్నోవేషన్ సెక్టార్లో సేవలందించే గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్, వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ ఇన్వెస్టింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాల్లో కీలక పాత్రపోషించారు. నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నించి అమెరికా శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా బ్యాంక్‌ను మూసేసింది. బ్యాంక్ సంక్షోభంతో ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10వేల టెక్నాలజీ కంపెనీలు..వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం నెలకొంది. లక్షకు పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా తీసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ బ్యాంకులో మన దేశానికి చెందిన స్టార్టప్‌లు కూడా డిపాజిట్లు పెట్టాయి. దీనిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారత స్టార్టప్ కంపెనీల నిధులు ఇరుక్కున్నాయా అనే వివరాలను శోధిస్తోంది. ఈ క్రమంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్వీబీలో ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఇలా ఎన్ని సంస్థల డిపాజిట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఉన్నయానే దానిపై కేంద్రం ఆరా తీసింది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ స్టార్టప్‌లకు చెందిన సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 8,251.5 కోట్లు) విలువైన డిపాజిట్లు ఉంటాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అంచనా వేశారు. ఈ స్టార్టప్‌లను స్థానిక బ్యాంకులు ఆదుకోవాలని, వారికి మరింతగా రుణాలు ఇవ్వాలని సూచించారు. అనిశ్చిత పరిస్థితులతో సంక్లిష్టమైన యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థపై మన దేశ స్టార్టప్‌లు ఆధారపడకుండా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉందని ట్విట్టర్ స్పేస్ చాట్‌లో కేంద్ర మంత్రి అన్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సిలికాన్ వ్యాలీ బ్యాంకు 2022 చివరి నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సంక్షోభం తలెత్తిన వెంటనే డిపాజిటర్లు ఒక్క రోజులోనే 42 బిలియన్ డాలర్ల వరకు ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న ఎస్వీబీని మూసివేశాయి. ఆ తర్వాత యూఎస్ ప్రభుత్వం డిపాజిటర్లకు వారి నిధులన్నింటికీ యాక్సెస్ ఉండేలా చర్యలు చేపట్టింది. -
ఎస్వీబీ సంక్షోభం: స్టార్టప్‌లకు రిస్కులు తొలగిపోయినట్లే!
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. ఎస్వీబీ ప్రధానంగా స్టార్టప్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్వీబీ బ్రిటన్ విభాగాన్ని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది. -
మూత పడనున్న మరో బ్యాంక్? షేర్లు భారీగా పతనం...
అమెరికా సిలికాన్ బ్యాంక్ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్‌తోపాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా అన్ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది. -
ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన!
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో కలవరం మొదలైంది. 2008 తర్వాత ఈ స్థాయిలో బ్యాంకులు కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ సైతం మూసివేసే పరిస్థితి నెలకొందంటూ ప్రముఖ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్, వాల్ స్ట్రీట్ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008 అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. ఆ బ్యాంక్ పతనం కాబోతుందంటూ రాబర్ట్ కియోసాకి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. బ్యాంక్‌ను మూసివేయడం, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడడం ఇలా అనిశ్చిలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో క్రెడిట్ సూయిస్ సైతం చిన్నాభిన్నం కాబోతుందంటూ కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాండ్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది. ఫెడ్ రేట్ల పెంపు, యుఎస్ డాలర్ క్షీణించడం వంటి అంశాల కారణంగా మార్కెట్లో ఆర్ధిక ఆనిశ్చితులు నెలకొన్నాయని కియోసాకి ఫాక్స్ న్యూస్ 'కావుటో : కోస్ట్ టు కోస్ట్' షోలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద పెట్టుబడి బ్యాంకు క్రెడిట్ సూయిస్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో అస్థిరత సమయంలో, బంగారంలో పెట్టుడులు, కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో డిపాజిట్లు.. ఆందోళనలో ఇండియన్ స్టార్టప్స్..
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన (ఎపాక్) చాలా మటుకు ఆర్థిక సంస్థలకు మూతబడిన అమెరికన్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెద్దగా లేవని మూడీస్ ఇన్వెస్టర్స్ సరీ్వస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల మూసివేత ప్రభావం వాటిపై అంతగా ఉండబోదని పేర్కొంది. డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో అమెరికాలో రెండు రోజుల వ్యవధిలోనే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకు మూతబడిన నేపథ్యంలో మూడీస్ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మూసేసిన అమెరికా బ్యాంకుల్లో చాలా మటుకు ఎపాక్ సంస్థల నిధులు ఏమీ లేవు. ఏవో అరకొర సంస్థలకు ఉన్నా అవి భారీ స్థాయిలో లేవు. మొత్తం మీద చాలా మటుకు సంస్థలకు ఎస్‌వీబీపరంగా భారీ నష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు‘ అని మూడీస్ పేర్కొంది. ఎపాక్‌లోని రేటెడ్ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, వాటి దగ్గర తగినంత స్థాయిలో నగదు లభ్యత ఉందని తెలిపింది. కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా వాటి దగ్గర వివిధ రంగాల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక శాఖ దృష్టికి స్టార్టప్‌ల కష్టాలు.. ఎస్వీబీ ప్రభావిత దేశీ స్టార్టప్‌ల సమస్యలను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సంక్షోభం నుంచి బైటపడేందుకు వాటికి కావాల్సిన సహాయం అందించాలని కోరనున్నట్లు వివరించారు. మంగళవారం అంకుర సంస్థలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. డిపాజిట్లు మొత్తం తిరిగి వస్తాయంటూ స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులకు అమెరికా ప్రభుత్వ వర్గాలు హామీ ఇస్తున్నప్పటికీ ఇందుకోసం ఎంత సమయం పడుతుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని మంత్రి తెలిపారు. ఎస్వీబీ మాతృసంస్థపై షేర్‌హోల్డర్ల దావా మూతబడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ)పై షేర్హోల్డర్లు కోర్టును ఆశ్రయించారు. ఎస్వీబీ మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్, సీఈవో గ్రెగ్ బెకర్, సీఎఫ్‌వో డేనియల్ బెక్‌పై కాలిఫోరి్నయాలోని న్యాయ స్థానంలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల వ్యాపారానికి పొంచి ఉన్న రిస్క్‌లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైందని పిటీషన్లో పేర్కొన్నారు. 2021 జూన్ 16–2023 మార్చి 10 మధ్య ఇన్వెస్ట్ చేసిన వారికి పరిహారం ఇప్పించాలని కోరారు. -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్‌లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్‌లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్‌చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్‌లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్‌వెస్ట్ బ్యాంక్‌కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
Gold rate: భారీగా పెరిగిన బంగారం ధరలు
జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ ప్రభావంతో మదుపర్లు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఇటీవలే తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తోపాటు సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత, అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ నివేదిక చెబుతుంది. ఇక తాజాగా మార్చి 13న ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 970 పెరిగి రూ. 56,550కి చేరింది. విదేశీ మార్కెట్లలో బంగారం ఔన్స్‌కు 1,875 డాలర్లు, వెండి 20.75 వద్ద ట్రేడ్ జరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ ఎకమిక్ డేటా పాజిటివ్‌గా రావడం, డాలర్లో పతనం, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద అమెరికా బ్యాంక్ వైఫల్యం కారణంగా బంగారం ధరలు ఐదు వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారు. ఈ కారణం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ నవనీత్ దమానీ చెప్పారు. -
సిగ్నేచర్ బ్యాంక్ మూత..ఈ గండం నుంచి ట్రంప్ గట్టెక్కిస్తారా?
తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్ధ్యం తగ్గి పోవడంతో రూ.17లక్షల కోట్లు (209 billion) ఆస్తులున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూత పడడం ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మూసివేతతో అమెరికాలో గత ఏడాది స్టాక్ మార్కెట్లోని లిస్టెడ్ కంపెనీలలో దాదాపు సగం టెక్నాలజీ, హెల్త్‌కేర్ స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఎస్వీబీ దారిలో న్యూయార్క్‌కు చెందిన సిగ్నేచర్ బ్యాంక్‌ను సైతం షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (fdic) తెలిపింది. దీంతో యూఎస్ బ్యాంకింగ్ చరిత్రలో 2వ అతిపెద్ద బ్యాంక్ పతనంగా నిలిచింది. ఖాతాదారులకు ఎఫ్‌డీఐసీ భరోసా కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన అనంతరం సిగ్నేచర్ బ్యాంకును ఎఫ్‌డీఐసీ తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ సందర్భంగా సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్ల బాధ్యత తమదేనని, దివాళా నష్టం పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపదని యూఎస్ ట్రెజరీ విభాగం, బ్యాంకు రెగ్యులేటర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. కాగా, న్యూయార్క్ ఫైనాన్షియల్ సర్వీస్ విభాగం లెక్కల ప్రకారం..గత ఏడాది ముగిసే సమయానికి ఆ బ్యాంకుకు మొత్తం 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. న్యూయార్క్, కనెక్టికట్, కాలిఫోర్నియా, నెవాడా, నార్త్ కరోలినాలో ప్రైవేట్ క్లయింట్ కార్యాలయాలతో కూడిన వాణిజ్య బ్యాంకు, రియల్ ఎస్టేట్, డిజిటల్ అసెట్ బ్యాంకింగ్‌తో సహా తొమ్మిది అంతర్జాతీయ వ్యాపారాల్లో భాగస్వామ్యంగా ఉంది.ఇప్పుడు మూసివేతతో ఆ బ్యాంక్ యాజమాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోంది. సిగ్నేచర్ బ్యాంక్‌ను డొనాల్డ్ ట్రంప్ ఆదుకుంటారా? signature bank యాజమాన్యం డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులతో సుదీర్ఘ కాలంగా మంచి సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ట్రంప్ వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ చూడడంతో పాటు అతని కుటుంబసభ్యులకు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు సైతం పెట్టింది. కానీ 2021, జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు డొనాల్డ్ ట్రంప్‌ను దూరం పెట్టింది. ఇప్పుడు రెగ్యులేటర్లు మూసి వేయడంతో సిగ్నేచర్ బ్యాంక్ సీఈవో జోసెఫ్ జె.డెపాలో (Joseph DePaolo) ట్రంప్ ఈ గండం నుంచి గట్టెక్కిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
జస్ట్..రూ.99కే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్ఎస్బీసీ!
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కుప్ప కూలింది. ఇప్పుడు ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఇతర దిగ్గజ బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా యునైటెడ్ కింగ్డమ్(uk) ప్రధాన కార్యాలయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ..యూకేలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే లిమిటెడ్‌ను (Silicon Valley Bank UK Ltd) 1 పౌండ్ (భారత్ కరెన్సీలో రూ.99) కు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో నోయల్ క్విన్ (Noel Quinn) తెలిపారు. ఈ కొనుగోలు యూకేలో హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సేవలకు ఊతం ఇస్తుందని, ఎస్వీబీ కస్టమర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకోనున్నట్లు హెచ్ఎస్బీసీ సీఈవో ప్రకటన చేశారు. చదవండి👉 భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్! యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) మూసి వేస్తున్నట్లు ప్రకటన చేయడం, ఆ తర్వాత సుమారు 175 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కాపాడుతున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే ను 1 ఫౌండ్కు సొంతం చేసుకోనున్నట్లు తెలుపుతూ.. ఓ ప్రకటన చేసింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం..యూకేలో ఎస్‌వీబీకి మార్చి 10 నాటికి మొత్తం 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు, 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు, 1.4 బిలియన్ పౌండ్ల ఈక్విటీ ఉంటుందని అంచనా వేసింది. ఇక తమ కొనుగోలు ప్రకటనతో యూకేలో ఎస్వీబీ లావాదేవీలు కొనసాగుతాయి. ఇప్పటికే తమ బ్యాంకు(hsbc) అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించి.. ఎస్‌వీబీకి నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఎస్వీబీని ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నారనే విషయాల గురించి వివరణ ఇవ్వలేదు. HSBC confirms it bought Silicon Valley Bank UK for £1 HSBC CEO Noel Quinn says: "This acquisition makes excellent strategic sense for our business in the UK. It strengthens our commercial banking franchise and enhances our ability to serve innovative and fast-growing firms" pic.twitter.com/5hs4FSAKK1 — Kalyeena Makortoff (@kalyeena) March 13, 2023 చదవండి👉 ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: లక్ష ఉద్యోగాలు, 10వేల స్టార్టప్‌లకు గండం
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్‌పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్‌లకు ఎస్వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) ఎస్వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్‌టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్‌లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు. సత్వర టేకోవర్‌కు ఆస్కారం.. ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్‌మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు. స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్‌లపై ఎస్వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు. భారతీయ స్టార్టప్‌లకు ఎస్వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర్కజ్క్) ఎస్వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది. అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి.. దేశీ సంస్థలపై ఎస్వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం: ఇండియన్ స్టార్టప్ సీఈఓ డీకోడ్స్
అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా కీర్తి పొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) పతనం ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 సంవత్సరం ఆర్ధిక సంక్షోభం తరువాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్ ఎస్వీబీ కావడం గమనార్హం. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్ నుంచి సుమారు 42 బిలియన్ డాలర్లను ఒక్కసారిగా ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని వినియోగదారులకు ఎస్వీబీ యాజమాన్యం లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. (ఇదీ చదవండి: సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్) 1980 నుంచి US స్టార్టప్‌లకు కీలక రుణదాతగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, భారతదేశంలోని అనేక స్టార్టప్‌లను కూడా ప్రభావితం చేసింది, అంతే కాకుండా వారి రోజువారీ నగదు అవసరాలు, ఇతర నిర్వహణ ఖర్చులను కూడా దెబ్బతీసింది. హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్వర్క్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రుచిత్ జి గార్గ్, భారతదేశంలోని స్టార్టప్ ఓనర్లలో ఒకరు, సుమారు పది సంవత్సరాలుగా ఎస్వీబీతో బ్యాంకింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం మా వద్ద డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. పూర్తి ప్రణాళిక, అదృష్టం ద్వారా మేము భారతీయ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఇప్పటికే చాలా డబ్బు సంపాదించామని, అందులో ఎక్కువ భాగం ఆ బ్యాంకులోని ఉన్నట్లు చెప్పారు. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, US వెంచర్-బ్యాక్డ్ టెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలలో కనీసం 50 శాతం SVBతో బ్యాంకింగ్ సంబంధాలను కలిగి ఉన్నాయి. అనేక భారతీయ స్టార్టప్‌లు ఇందులో డిపాజిట్లు, పెట్టుబడులను కలిగి ఉన్నాయి. మిస్టర్ గార్గ్ భారతీయ సంస్థలపై పతనం ప్రభావాన్ని వివరించడానికి డెట్, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. -
భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్!
ప్రపంచ దేశాల్లో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్ (భారత్‌లో 21 స్టార్టప్)ల్లో పెట్టుబడులు పెట్టి, వాటికి బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) నిండా మునిగింది. 2008 లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్ దివాళాకు కారణమైంది. ఇప్పుడీ పరిణామాలతో అమెరికా నుంచి 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి చెందిన శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ (ఎస్వీసీ) బ్యాంకు దివాళా తీస్తుందనే పుకార్లు కలకలం రేపుతున్నాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న ఎస్వీబీ బ్యాంక్ మూతపడితే.. భారత్‌లో ఉన్న బ్యాంక్‌కు ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పుకార్లతో సదరు బ్యాంక్ స్పందించింది. పుకార్లను కొట్టిపారేసింది. ఈ రూమర్స్‌ను స్ప్రెడ్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్‌కు చెందిన బ్యాంక్ మూత పడిందంటూ మనదేశానికి చెందిన ఎస్వీసీ బ్యాంక్ 1906 నుంచి ముంబై కేంద్రంగా వినియోగదారులకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. 11 రాష్ట్రాల్లో 198 బ్రాంచీలు, 214 ఏంటీఎంలు, 2300 మంది ఉద్యోగులతో 100 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్ఏఎఫ్సీయూబీ అవార్డ్ దక్కించుకుంది. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్వీసీ బ్యాంక్ ప్రస్తుతం రూ.31,500 కోట్ల బిజినెస్ చేస్తుండగా ఆర్ధిక సంవత్సరం 2021-22లో రూ.146 కోట్ల నెట్ప్రాఫిట్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బ్యాంక్ మూతపడిందంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో ఆబ్యాంక్ కస్టమర్లు ఆందోళన గురయ్యారు. ఆ బ్యాంకులో దాచిన డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్ బ్రాంచీలను సంప్రదించారు. అది ఎస్వీబీ బ్యాంక్.. మనది ఎస్వీసీ బ్యాంక్ అయితే కస్టమర్ల ఆందోళనతో ఎస్వీసీ బ్యాంక్ అధికారికంగా ఓ నోటీసును విడుదల చేసింది. ఆ నోటీసుల్లో ఉన్న వివరాల మేరకు..అమెరికాలో ఉన్న దిగ్గజ బ్యాంక్ మూత పడింది. అది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) కాగా.. మనది శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ ( svc) అని స్పష్టత ఇచ్చింది. ఇక ఎస్‌వీసీపై వస్తున్న తప్పుడు ప్రచారంతో .. కస్టమర్లు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. Important announcement#HumSeHaiPossible #SVCBank #Banking #SVC #Importantannouncement pic.twitter.com/p05lHBJm9w — SVC Bank (@SVC_Bank) March 11, 2023 ఇది వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఆ వివరణతో ఎస్వీసీ కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. సదరు బ్యాంకుపై వస్తున్న రూమర్లకు నెటిజన్లు తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. ZyppElectric సీఈవో ఆకాష్ గుప్తా మాట్లాడుతూ.. తర్వాత ఎస్ఎల్బీ(సంజయ్ లీలా భన్సాలీ) ప్రకటన విడుదల చేయొచ్చని ట్వీట్లో పేర్కొనగా.. భారత్ అద్భుతమైందని మరో యూజర్ వెటకారంగా కొనియాడగా ..భారతీయుల్లారా..వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఇలా ఉందని కామెంట్ చేశాడు. ఎస్వీసీ ముఖ్యమైన వివరణ ఇచ్చిందంటూ మరో యూజర్ కృజ్ఞతలు తెలిపారు. -
ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
ఉక్రెయిన్ యుద్ధం, ధరల మంట, ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీల్లో సంక్షోభం నెలకొంది. ఆ సంక్షోభం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) మూసివేతతో మరింత తీవ్రతరమైనట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఎస్వీబీని షట్‌డౌన్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ప్రకటించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌కు చెందిన టెక్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన బెంజిమన్.. టెక్నాలజీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘మేం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసి వేత..టెక్నాలజీ వరల్డ్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది’ అని ట్వీట్ చేశారు. అవసరం అయితే తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ కంపెనీలకు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ కేంద్రంగా ప్రధాన టెక్ కంపెనీలపై ఎస్వీబీ ప్రభావం పడితే.. ఆ అలజడిని నుంచి రక్షించేందుకు సిద్ధమని అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో టెక్ కంపెనీలను ఎస్వీబీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బెంజిన్ రోమ్‌లో పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే తాజా పరిస్థితులపై టెక్నాలజీ నిపుణులతో మాట్లాడారు. రోమ్ నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే అమెరికన్ దిగ్గజ బ్యాంక్ దివాళాతో దేశీయ టెక్ కంపెనీలపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనే విషయంపై ఫైనాన్స్, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో చర్చిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ట్వీట్లో చెప్పారు. కొంపముంచుతున్న ఎస్వీబీ బాగోతం ఇక మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఇప్పటికే ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ఐటీ రంగం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ దిగ్గజ బ్యాంక్‌తో లావాదేవీలు నిర్వహిస్తున్న అమెరికా, యూకే, ఇజ్రాయిల్‌తో పాటు మరిన్ని దేశాలకు చెందిన టెక్ కంపెనీలు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించగా.. ఐటీ రంగంలో అసలేం జరుగుతోంది అంటూ ప్రపంచవ్యాప్తంగా మరో సారి చర్చ మొదలైంది ఐటీ రంగంలో ఏం జరుగుతోంది ఇప్పటికే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నాయి. ఏ మాత్రం లాభదాయకం లేదని అనిపిస్తే మూసేస్తున్నాయి. ట్విటర్లాంటి సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్ తో పాటు ఇతర వస్తువుల్ని అమ్మి పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఐటి రంగం మరింత సంక్షోభం తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధం?
యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంక్ సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan) ఓ సలహా ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్వీబీని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చమని అన్నారు. అందుకు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎస్వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ ట్విట్ చేశారు. I think Twitter should buy SVB and become a digital bank. — Min-Liang Tan (@minliangtan) March 11, 2023 I’m open to the idea — Elon Musk (@elonmusk) March 11, 2023 60 శాతం పతనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎస్‌వీబీకి చెందిన 60 శాతం షేర్లు భారీగా పతనమయ్యాయి. చదవండి👉 దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం!