అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా కీర్తి పొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) పతనం ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 సంవత్సరం ఆర్ధిక సంక్షోభం తరువాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్ ఎస్‌వీబీ కావడం గమనార్హం.
ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్ నుంచి సుమారు 42 బిలియన్ డాలర్లను ఒక్కసారిగా ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని వినియోగదారులకు ఎస్‌వీబీ యాజమాన్యం లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది.
(ఇదీ చదవండి: సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్)
1980 నుంచి US స్టార్టప్‌లకు కీలక రుణదాతగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, భారతదేశంలోని అనేక స్టార్టప్‌లను కూడా ప్రభావితం చేసింది, అంతే కాకుండా వారి రోజువారీ నగదు అవసరాలు, ఇతర నిర్వహణ ఖర్చులను కూడా దెబ్బతీసింది.
హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్‌వర్క్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రుచిత్ జి గార్గ్, భారతదేశంలోని స్టార్టప్ ఓనర్లలో ఒకరు, సుమారు పది సంవత్సరాలుగా ఎస్‌వీబీతో బ్యాంకింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం మా వద్ద డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. పూర్తి ప్రణాళిక, అదృష్టం ద్వారా మేము భారతీయ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఇప్పటికే చాలా డబ్బు సంపాదించామని, అందులో ఎక్కువ భాగం ఆ బ్యాంకులోని ఉన్నట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: భారత్‌లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు)
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, US వెంచర్-బ్యాక్డ్ టెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలలో కనీసం 50 శాతం SVBతో బ్యాంకింగ్ సంబంధాలను కలిగి ఉన్నాయి. అనేక భారతీయ స్టార్టప్‌లు ఇందులో డిపాజిట్లు, పెట్టుబడులను కలిగి ఉన్నాయి. మిస్టర్ గార్గ్ భారతీయ సంస్థలపై పతనం ప్రభావాన్ని వివరించడానికి డెట్, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment