Indian startups
-
Sarvam AI: భారతీయ ‘గొంతు’కు మైక్రోసాఫ్ట్ మద్దతు!
భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. వాయిస్ ఆధారిత జనరేటివ్ AIని అభివృద్ధి చేయడం, అజూర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా సర్వం ఏఐకి (Sarvam AI)కి మద్దతు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భారత్‌లో ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భారంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించింది. సర్వం ఏఐ భారతీయ భాషలు, నేపథ్యంపై ఉత్పాదక ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో పని చేస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, ఖోస్లా వెంచర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో సుమారు రూ.340 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ స్టార్టప్‌ను స్థాపించిన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్‌లు గతంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధనా బృందం ఏఐ4భారత్‌తో కలిసి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు. ప్రతిఒక్కరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఏఐ-మొదటి దేశంగా భారత్ పరివర్తన చెందడానికి సాధికారత కల్పిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా & దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అన్నారు. సర్వం ఏఐతో సహకారం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, వారి భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా వాయిస్-ఆధారిత ఏఐ సొల్యూషన్ల శక్తి నుంచి ప్రయోజనం పొందగల భవిష్యత్తును తాము ప్రోత్సహిస్తున్నామని చందోక్ చెప్పారు. భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ అప్లికేషన్ల కోసం వాయిస్ అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌లలో ఒకటి. విద్య, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో దీన్ని వర్తింపజేయొచ్చు. సర్వం ఏఐ ఇండిక్ వాయిస్ ఎల్ఎల్ఎంను అజూర్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా భారత్-కేంద్రీకృతంగా మరిన్ని ఆవిష్కరణలు రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ పునాదులు వేస్తోంది. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ.. ఏకమైన 40 భారతీయ కంపెనీలు!
Google Play Billing System: టెక్ దిగ్గజం గూగుల్ (Google)కు వ్యతిరేతికంగా 40 భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలు ఏకమయ్యాయి. గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ను సవాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఆధ్వర్యంలో సామూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్‌కు చెందిన GPBS ప్రకారం.. గూగుల్ ప్లేలోని యాప్ కొనుగోళ్లన్నీ తమ చెల్లింపు గేట్‌వే ద్వారానే జరగాలి. ఈ లావాదేవీలపై గూగుల్ భారీగా 30 శాతం కమీషన్ విధిస్తోంది. అయితే భారత్‌లో GPBSకి బదులుగా యూజర్ చాయిస్ బిల్లింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవలి తీర్పులో గూగుల్‌ను ఆదేశించింది. చట్టపరమైన చర్యలు! మీడియా నివేదికల ప్రకారం.. గూగుల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వారి ఆందోళనల తీవ్రతను సూచిస్తూ గూగుల్‌పై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ టాస్క్‌ఫోర్స్ ముందు హాజరై వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ టాస్క్‌ఫోర్స్‌లో గూగుల్ కూడా ప్రతినిధి స్థానాన్ని కలిగి ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. (సీఎఫ్‌వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!) ఇక మరో అంశంలో సీసీఐ విధించిన రూ. 936.44 కోట్ల పెనాల్టీపై గూగుల్ అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నవంబర్ 28న విచారించనున్నట్లు ప్రకటించింది. ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి దాని ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. -
దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా తీసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ బ్యాంకులో మన దేశానికి చెందిన స్టార్టప్‌లు కూడా డిపాజిట్లు పెట్టాయి. దీనిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారత స్టార్టప్ కంపెనీల నిధులు ఇరుక్కున్నాయా అనే వివరాలను శోధిస్తోంది. ఈ క్రమంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్వీబీలో ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఇలా ఎన్ని సంస్థల డిపాజిట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఉన్నయానే దానిపై కేంద్రం ఆరా తీసింది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ స్టార్టప్‌లకు చెందిన సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 8,251.5 కోట్లు) విలువైన డిపాజిట్లు ఉంటాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అంచనా వేశారు. ఈ స్టార్టప్‌లను స్థానిక బ్యాంకులు ఆదుకోవాలని, వారికి మరింతగా రుణాలు ఇవ్వాలని సూచించారు. అనిశ్చిత పరిస్థితులతో సంక్లిష్టమైన యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థపై మన దేశ స్టార్టప్‌లు ఆధారపడకుండా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉందని ట్విట్టర్ స్పేస్ చాట్‌లో కేంద్ర మంత్రి అన్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సిలికాన్ వ్యాలీ బ్యాంకు 2022 చివరి నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సంక్షోభం తలెత్తిన వెంటనే డిపాజిటర్లు ఒక్క రోజులోనే 42 బిలియన్ డాలర్ల వరకు ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న ఎస్వీబీని మూసివేశాయి. ఆ తర్వాత యూఎస్ ప్రభుత్వం డిపాజిటర్లకు వారి నిధులన్నింటికీ యాక్సెస్ ఉండేలా చర్యలు చేపట్టింది. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం: ఇండియన్ స్టార్టప్ సీఈఓ డీకోడ్స్
అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా కీర్తి పొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) పతనం ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 సంవత్సరం ఆర్ధిక సంక్షోభం తరువాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్ ఎస్వీబీ కావడం గమనార్హం. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్ నుంచి సుమారు 42 బిలియన్ డాలర్లను ఒక్కసారిగా ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని వినియోగదారులకు ఎస్వీబీ యాజమాన్యం లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. (ఇదీ చదవండి: సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్) 1980 నుంచి US స్టార్టప్‌లకు కీలక రుణదాతగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, భారతదేశంలోని అనేక స్టార్టప్‌లను కూడా ప్రభావితం చేసింది, అంతే కాకుండా వారి రోజువారీ నగదు అవసరాలు, ఇతర నిర్వహణ ఖర్చులను కూడా దెబ్బతీసింది. హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్వర్క్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రుచిత్ జి గార్గ్, భారతదేశంలోని స్టార్టప్ ఓనర్లలో ఒకరు, సుమారు పది సంవత్సరాలుగా ఎస్వీబీతో బ్యాంకింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం మా వద్ద డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. పూర్తి ప్రణాళిక, అదృష్టం ద్వారా మేము భారతీయ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఇప్పటికే చాలా డబ్బు సంపాదించామని, అందులో ఎక్కువ భాగం ఆ బ్యాంకులోని ఉన్నట్లు చెప్పారు. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, US వెంచర్-బ్యాక్డ్ టెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలలో కనీసం 50 శాతం SVBతో బ్యాంకింగ్ సంబంధాలను కలిగి ఉన్నాయి. అనేక భారతీయ స్టార్టప్‌లు ఇందులో డిపాజిట్లు, పెట్టుబడులను కలిగి ఉన్నాయి. మిస్టర్ గార్గ్ భారతీయ సంస్థలపై పతనం ప్రభావాన్ని వివరించడానికి డెట్, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. -
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
నేటి స్టార్టప్‌లే రేపటి ఎమ్ఎన్సీలు
న్యూఢిల్లీ: భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్‌సీలు భారత్‌లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్‌సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్‌లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు. -
భారీ సబ్సిడీతో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, బెంగళూరు: బెంగళూరు ఆధారిత స్టార్టఅప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మంగళవారం లాంచ్ చేసింది. మేడిన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశంలో తయారైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ మద్దతుతో ఎథర్ కంపెనీ ఏథర్ 340, ఎథర్ 450 పేరిట ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో ఆవిష్కరించింది. ఎథర్ వెబ్‌సైట్‌తోపాటు బెంగుళూరులోని ఎథర్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. అమెరికాలోని తెస్లా తరువాత ఈ తరహాలో ఎలక్ట్రిక్ బైక్స్‌లను తయారుచేస్తున్న తొలి సంస్థగా ఏథర్ నిలవనుంది. ప్రభుత్వం నుంచి దాదాపు 20 శాతం సబ్సిడీతో కలిపి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాహనాలతో పోలిస్తే సగం ధరలకే ప్రారంభించింది. అయితే ఈ వాహనాలు తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు మోడల్స్‌లోను సిమ్‌కార్డుల ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. రెండు స్కూటర్లు పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి పనిచేస్తాయి. దీనికోసం ప్రత్యేకమైన బ్యాటరీలను ఏర్పాటు చేశారు. కేవలం 1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే చాలు, 1 కిలోమీటర్ దూరం వెళ్లగలిగేంత వేగంగా చార్జింగ్ అవుతాయి. సిటీ రైడింగ్ కండిషన్స్‌కు అనుకూలంగా తయారు చేసిన ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ స్కూటర్ సొంతం. అలాగే ఎథర్ 340 స్కూటర్ గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ 5.1 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకోగలదు. దీనితోపాటు ఏథర్ ఎనర్జీ బెంగళూరు నగర వ్యాప్తంగా ఇప్పటికే 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఏథర్‌గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లు ఫాస్ట్-ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఫీచర్లు 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అందులో స్పీడ్, బ్యాటరీ కెపాసిటీ, తిరిగిన కిలోమీటర్లు, నావిగేషన్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక ఈ స్కూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌కు ఎప్పటికప్పుడు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అప్డేట్లను అందిస్తారు. ఈ స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా స్కూటర్ ఎక్కడ ఉంది ఫోన్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ లైఫ్ 5 నుంచి 6 సంవత్సరాలు. ఐపీ67 రేటింగ్ ఈ బ్యాటరీ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను జోడించింది. ఈ బ్యాటరీలు 50వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ పూర్తి చార్జింగ్కు 4 గంటల 18 నిమిషాల సమయం పడుతుంది. ఈ స్కూటర్లకు 2 ఏళ్ల వారంటీ (30వేల కిలోమీటర్లు)ని అందిస్తున్నారు. అంతేకాదు బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. ధర, ఇతర ఆఫర్లు ఏథర్ 450 ఆన్‌రోడ్ ధర రూ.1,24,750 ఉండగా, ఏథర్ 340 ఆన్‌రోడ్ ధర రూ.1,09,750 గా ఉంది. ఇందులో ఎలక్ట్రిక్వాహనాలకు ప్రోత్సాహమిచ్చే ప్రభుత్వ పథకం "ఫేం" కింద 22 వేల రూపాయల సబ్సిడీ జీఎస్టీ, రోడ్‌ట్యాక్స్, స్మార్ట్ కార్డ్ ఫీజు, రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీరేట్లను కలిపి ఈ ధర అని తెలిపింది. వీటి కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్ కూడా లభ్యం.. అలాగే 700రూపాయల నెలవారీప్లాన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో సర్వీసు, డోర్‌స్టెప్ పికప్, డెలివరీ, బ్రేడ్ డౌన్ అసిస్టెన్స్, వాహనాలపై డేటా ఛార్జీలు, వినియోగం, ఇంధనం లాంటి ఇతర సేవలను ఆఫర్ చేస్తోంది. ఇంటి దగ్గర, ఆఫీసు, లేదా సాధారణ సాకెట్ నుండి వినియోగదారులు ఈ వాహనాన్ని ఛార్జ్ చేయవచ్చు. మూడు నెలల లోపల దీన్ని రీఫండ్ ఇస్తుంది. కాగా దేశంలోని నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, వాల్‌మార్ట్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ సహా, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారుల నుండి ఇప్పటివరకు 43 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది ఏథర్ ఎనర్జీ. -
సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి
న్యూఢిల్లీ : భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ బుధవారం పేర్కొంది. ముఖ్యంగా దేశీయ స్టార్టప్స్ స్నాప్ డీల్, ఓలా కంపెనీ వల్ల సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు తెలిసింది. సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు వెల్లడించింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది. భారత్ లో ఈ-కామర్స్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, అంచనావేసిన దానికంటే మరింత తక్కువగా స్నాప్ డీల్ ప్రదర్శన ఉందని సాఫ్ట్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్ డీల్ అత్యల్ప ప్రదర్శనతో స్టార్ ఫిష్ నికర ఆస్తి విలువ తగ్గిపోయినట్టు ఈ టెలికమ్యూనికేషన్ దిగ్గజం పేర్కొంది. దేశీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో సాఫ్ట్ బ్యాంకు అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్. ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లకు పైగా(12,911 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం స్నాప్ డీల్ ను దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు విక్రయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్నాప్ డీల్ లో సాఫ్ట్ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల(5,810కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కూడా స్నాప్ డీల్, ఓలాల వల్ల 350 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు సాప్ట్ బ్యాంకు తెలిపిన సంగతి తెలిసిందే.