దిగ్విజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఇంద్రసేన
సాక్షి, హైదరాబాద్: సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అనుమానాలు వ్యక్తం చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరడం సరికాదని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ముస్లింలపై బీజేపీ వ్యతిరేక భావనతో ఉన్నందువల్లే ఎన్కౌంటర్ చేశారని దిగ్విజయ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. భోపాల్‌లో కానిస్టేబుల్ మృతి, గతంలో సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన తీవ్రవాదులు తప్పించుకుని పారిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.