బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాడు..!
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి యూనిట్‌పై సినీ వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూడా చేరాడు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ప్రశంసిస్తూ స్వహస్తాలతో ఓ లెటర్ రాసిన గుణశేఖర్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కీర్తిస్తూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు.అయితే ఈ కామెంటే ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది.
సినిమా అనేది ఎంతటి బలమైన మీడియమో మరోసారి నిరూపించినందుకు శుభాకాంక్షలన్న గుణశేఖర్, ఓ మామూలు కథను కూడా మీ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో గొప్పగా చిత్రీకరించినందుకు హాట్సాఫ్ అంటూ కామెంట్ చేశాడు. కేవలం విజయేంద్ర ప్రసాధ్ అందించిన కథ, ఆయన సృష్టించిన పాత్రల వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని బాహుబలి యూనిట్ చెపుతున్న తరుణంలో గుణశేఖర్ ఆ కథను సింపుల్ స్టోరి అంటూ తేల్చేయటం రాజమౌళి, ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
@ssrajamouli pic.twitter.com/xrl4BJW8rp
— Gunasekhar (@Gunasekhar1) 28 April 2017