టైటానిక్ ప్రమాదం వెనుక...
లండన్: టైటానిక్ నౌక ప్రమాదానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ భావిస్తున్నట్లుగా మంచు కొండను ఢీకొని టైటానిక్ మునిగిపోలేదని, బాయిలర్‌లో ఏర్పడిన మంటల వల్లనే మునిగి పోయిందని ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత సీనన్ మోలోని తాను రూపొందించిన డాక్యుమెం టరీలో పేర్కొన్నాడు. టైటానిక్ ప్రమాదానికిగల అసలు కారణం తెలుసుకునేందుకుగాను మోలోని గత 30ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. తన పరిశోధన ప్రకారం టైటానిక్ షిప్‌యార్డ్‌లో ఉండగానే బాయిలర్‌లో ఏర్పడిన ఈ మంటల వల్ల నౌక అడుగుభాగం బలహీనంగా మారిందని, బలహీనంగా మారిన ఓడ భాగాన్నే మంచుకొండ ఢీకొందన్నారు.