‘సింధు’ను రద్దు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం
భారత్కు పాక్ నేతల హెచ్చరిక
ఇస్లామాబాద్: సింధు జల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేస్తే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాకిస్తాన్ రాజకీయ నాయకులు హెచ్చరించారు. అలాగే, బలూచిస్తాన్లో భారత్ జోక్యాన్ని ఖండిస్తున్నామన్నారు. సోమవారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో రాజకీయ, పార్లమెంటరీ నాయకుల సమావేశం జరిగింది. సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దుచేస్తే దాన్ని దుందుడుకు చర్యగా పరిగణిస్తామని సమావేశంలో అన్ని పార్టీల నాయకులు చెప్పారు.
వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చేందుకు వాస్తవాధీన రేఖ ఉగ్రవాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిందని భారత్ను నిందించారు.