breaking news
singaiah
-
సింగయ్యను చంపేసారా? మరణం వెనుక మిస్టరీ?
-
సింగయ్య లేచి వచ్చి చెప్పిన.. అది కూడా మేనేజ్ అంటారేమో చంద్రబాబు
-
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్‌లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్‌ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్‌పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్‌ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్‌లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్‌కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య -
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్‌కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్‌తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
సింగయ్య, జయవర్దన్ కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో.. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్‌రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు. -
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరణానికి బాధ్యులుగా చేస్తూ... కారులో ప్రయాణిస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనల సందర్భంగా కౌంటర్ దాఖలుకు తాము సమయం కోరుతుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యతిరేకించారు. తమ వాదనలను పూర్తిగా వినిపించలేదని, అలాంటప్పుడు స్టే ఇవ్వడం సరికాదంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీంతో క్వాష్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.సింగయ్య మృతికి సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేవరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మంగళవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి మరోసారి విచారణ జరిపారు.సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతున్నారు..వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సింగయ్య గుర్తుతెలియని వాహనం కిందపడి మృతి చెందారని తొలుత మీడియాకు చెప్పిన జిల్లా ఎస్పీ, తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు. అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 106ను సెక్షన్ 105కు మార్చారని తెలిపారు. కోర్టు తమకు రక్షణ కల్పించిన మాట వాస్తవమేనని, అయితే తప్పుడు ఉద్దేశాలతో పెట్టిన కేసు నిలవడానికి ఎంతమాత్రం వీల్లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కిందపడే సింగయ్య మృతి చెందారంటూ ఆ కారును సీజ్ చేశారన్నారు.ఆయనను అవమానించడానికే ఇలా చేశారని.. పోలీసుల అత్యుత్సాహానికి, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనడానికి, రాజకీయ కక్షకు ఇదో పరాకాష్ఠ అని తెలిపారు. కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాలంటూ దానిని చదివి వినిపించారు. సింగయ్యే ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారని తెలిపారు. ఈ మేరకు వీడియోలు ఉన్నాయన్నారు. అతడు కారు కిందపడిన వెంటనే పార్టీ కార్యకర్తలు పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, 40 నిమిషాలు బతికే ఉన్నారని వివరించారు.సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినట్లు దర్యాప్తు అధికారే చెబుతున్నారు..సింగయ్యపైకి కారు ఎక్కించినట్లు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సెక్షన్‌ను జత చేశారని సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ మొదట కేసు పెట్టి, దానిని మార్చి కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టారన్నారు. సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతుంటే, పోలీసులు మాత్రం కారులో ఉన్న వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టారని.. ఈ సెక్షన్ కింద కేసు ఎంతమాత్రం చెల్లదని వివరించారు. ఘటనాస్థలంలో లేనివారిని కూడా సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.విశ్వసనీయ సమాచారం అంటూ పోలీసులు వాస్తవాలను మరుగున పెడుతున్నారన్నారు. ఇది రాజకీయ దురుద్దేశాలను స్పష్టం చేస్తోందన్నారు. సింగయ్య కారు కింద పడిన వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి చెబుతున్నారని, ఈ రోజుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఏ వీడియోనైనా సృష్టించడం చాలా తేలిక అని వివరించారు. వైఎస్ జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌ను తొందర పెట్టారంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందిన్యాయమూర్తి స్పందిస్తూ... కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు రక్షణ కల్పించింది కదా? అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలుకు గడువు కోరుతున్నారని గుర్తుచేశారు. దీనికి శ్రీరామ్ ప్రతిస్పందిస్తూ, వైఎస్ జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగా భద్రతను పట్టించుకోవడం లేదని, దీంతో ఆయన పర్యటనల సందర్భంగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయన్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, లేదంటే సింగయ్య కారు కింద పడేవారు కాదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు.అత్యవసర విచారణ అవసరం లేదువిచారణ మొదలుకాగానే ఏజీ స్పందిస్తూ, మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని, లేకపోతే వారం అయినా గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని, అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లు వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లుసింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, ఆర్.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యంవైఎస్ జగన్ తరఫున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్ఎస్ సెక్షన్ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్ హోమిసైడ్) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
సింగయ్య మృతి ఘటనపై ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర
-
ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర!
సింగయ్యను పచ్చ బ్యాచ్ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిలువరించడానికే కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్, పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటికి వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం... అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తోంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్రెడ్డిని ఏదో రకంగా కేసులో ఇరికించడమే వారి కుట్ర కాబట్టి.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో, చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మారంగా వ్యవహరించింది. వైఎస్ జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని.. పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచి్చన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ2గా, ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజినిలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు, ఎల్లో మీడియా చెబుతున్న, చూపిస్తున్న వీడియో విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 4 టన్నుల బరువున్న వాహనం ఎక్కితే కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతాడా?మామూలు ఫార్చూనర్ వాహనం రెండు వేల కిలోలు ఉంటుంది. అదే బుల్లెట్‌ప్రూఫ్ వాహనమైతే 3.5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళితే స్పాట్లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతాడు. అలాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని చెబుతున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలుమీద కాలేసుకుని పడుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేటు వాహనంలో అతడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలే కనపడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైరు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతన్ని బయటకు తీసిన వీడియో ఎందుకు బయటకు రాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించినట్లు స్పష్టం అవుతోంది. చిన్న గాయాలకే చనిపోయాడా? మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడి వైపు, కుడి మోచేయి వెనుక నుంచి అరచేయి వెనుక భాగం వరకు, మోకాళ్ల వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి, హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఇది కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. దుర్మార్గానికి పరాకాష్టపోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్‌ను కారులో ఉన్న జగన్మోహన్రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా రాశారు. అసలు వీఐపీ వెహికల్లో ఉన్న వారు డోర్ గ్లాస్లు వేసిన కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? సంఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఫుట్ రెస్ట్ ప్లేట్‌పై నిలబడి బయటి ప్రజలకు అభివాదం చేస్తుండటం ఆ ఫేక్ వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనపడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే.. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినప్పటికీ.. వాహనం పోనివ్వమని చెప్పారంటూ ఎఫ్ఐఆర్లో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. -
సింగయ్య చనిపోయే అవకాశమే లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్‌లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. తేలికపాటి గాయాలే అయ్యాయి హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్ చెప్పి.. ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు. సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్‌గా తేల్చుకుంటా’ అని చెప్పారు. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్‌కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్‌ను తాడేపల్లి స్టేషన్‌కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్‌గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్‌ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్‌చేసి, డ్రైవర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్‌కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్యకు ఘన నివాళి
పీసీపల్లి (పెదఅలవలపాడు) : మండలంలోని పెదఅలవలపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త బోగాడ సింగయ్యపై టీడీ పీ కార్యకర్తలు పాశవికంగా దాడి చేసి కర్రలతో కొట్టి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. కాగా శుక్రవారం రాత్రి సింగయ్య మృతదేహాన్ని పెదఅలవలపాడుకు తీసుకొచ్చారు. కొట్టొద్దని బతిమలాడినా తన భర్తను చనిపోయే దాకా కొట్టారని సింగయ్య భార్య వైఎస్సార్ సీపీ నేత బుర్రా మధుసూధన్ యాదవ్ వద్ద కన్నీటి పర్యంతమైంది. తన తండ్రిని టీడీపీ వాళ్లు అన్యాయంగా కొట్టి చంపారని తమకు న్యాయం చేయాలంటూ సింగయ్య కుమారుడు సురేష్ బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. సింగయ్య భౌతికకాయానికి బుర్రా మధుసూదన్‌తో పాటు బొర్రా మాల్యాద్రి చౌదరి, కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, పామూరు కన్వీసర్ అంబటి కొండారెడ్డి, రామిరెడ్డి, వైఎం ప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటా టీడీపీ నేతల దాష్టికానికి బలైన సింగయ్య కుటుంబానికి తాను అండగా ఉంటానని బుర్రా మధుసూధన్ హామీ ఇచ్చారు. సింగయ్య మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.