Singanamala MLA
-
శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
అనంతపురం క్రైం: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బుధవారం రాత్రి అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. (చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..) ఎమ్మెల్యే వాహనం సోములదొడ్డి వద్ద నేషనల్ హైవే మీదకు మళ్లిన వెంటనే వెనుక వైపు నుంచి ఫోర్డ్ ఫిగో కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేకు ఎటువంటి ఆపద తలెత్తలేదు. ప్రమాదంలో రెండు కారులూ దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వాహనంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు డ్రైవర్, గన్మెన్ ఉన్నారు. ఫోర్డ్ ఫిగో వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఫిగో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే అందులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి -
ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో వరుణయాగం
సాక్షి, శింగనమల: వరుణుడి కరుణ కోసం శింగనమలలోని ఆత్మారామాలయంలోని తలంబ్రాల మండపంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో గురువారం వరుణయాగాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. బొడ్రాయికి పూజలు చేసి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉడిపి నుంచి వచ్చిన వేద పండితులు వరుణయాగాన్ని ప్రారంభించారు. హోమం నిర్వహిస్తున్న వేద పండితులు పంచగవ్య సిద్ధి, పుణ్యాహ వచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం, నవగ్రహ జపం, రుత్విక్ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. తరలివచ్చిన భక్తజనం శింగనమలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి శింగనమల, గార్లదిన్నె, బీకేఎస్, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాలతో పాటు జిల్లా కేంద్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. -
ఎమ్మెల్యే అండతో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన జనంపై విరుచుకుపడటం టీడీపీ నాయకులకు నిత్యకృత్యంగా మారింది. తాజాగా అనంతపురం శింగనమల టీడీపీ ఎమ్మెల్యే యామిని బాల శుక్రవారం రైతులు, మహిళలపై శివమెత్తారు. నీళ్లు ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయాలని అడినందుకు తిట్లదండకం అందుకున్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గార్లదిన్నె మండలం ఇల్లూరులో ఆమె పర్యటించారు. తుంగభద్ర నుంచి నీరు వచ్చేలా చేయాలని రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని మహిళలు.. ఎమ్మెల్యేని అడిగారు. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు బుద్ధి, జ్ఞానం లేదంటూ తిట్టారు. ఎమ్మెల్యే అండతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటూ రైతులు, మహిళలను టీడీపీ నేత రామాంజనేయ బహిరంగంగా హెచ్చరించారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ఏమీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. టీడీపీ నేతల దౌర్జన్యంపై స్థానికులు మండిపడుతున్నారు. మహిళ అయివుండి సాటి మహిళలపై ఎమ్మెల్యే యామిని బాల ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.