the singles title
-
ఫెడరర్ ఖాతాలో 97వ టైటిల్
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో అతను మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. సోమ వారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న ఫెడరర్ తాజా విజయంతో అతని ర్యాంక్ నాలుగు వారాలపాటు పదిలంగా ఉంటుంది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెరెనా ‘హ్యాట్రిక్'
సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది సెరెనా ఈ టోర్నీ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 6-0 తేడాతో సిమోనా హలెప్ (రొమేనియా)ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో హలెప్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సెరెనా ఫైనల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 69 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మొదటి సెట్లో ఒక దశలో హలెప్ 3-1తో ఆధిక్యంలో నిలిచినా... కోలుకున్న సెరెనా చెలరేగింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్న ఈ అమెరికా ప్లేయర్, రెండో సెట్లో పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఓవరాల్‌గా ఐదో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా, 2014ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది.