సెరెనా ‘హ్యాట్రిక్' | Serena Williams Punishes Simona Halep for Earlier Defeat | Sakshi
Sakshi News home page

సెరెనా ‘హ్యాట్రిక్'

Published Mon, Oct 27 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

సెరెనా ‘హ్యాట్రిక్'

సెరెనా ‘హ్యాట్రిక్'

సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది సెరెనా ఈ టోర్నీ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 6-0 తేడాతో సిమోనా హలెప్ (రొమేనియా)ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో హలెప్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సెరెనా ఫైనల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

69 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మొదటి సెట్‌లో ఒక దశలో హలెప్ 3-1తో ఆధిక్యంలో నిలిచినా... కోలుకున్న సెరెనా చెలరేగింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్న ఈ అమెరికా ప్లేయర్, రెండో సెట్‌లో పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఓవరాల్‌గా ఐదో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా, 2014ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement