సితార హోటల్లో వ్యభిచారం, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : సితార హోటల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎల్బీనగర్ సితారా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారమందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు.
విజయవాడ ఎంకె జూయలరీ యజమాని మురళీ కృష్ణ, మోడీ నగర్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ నిహారికలు హోటల్ రూమ్‌లో అశ్లీలంగా ఉన్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఈ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.