sitting MPs
-
Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
ఆరో విడతలో భాగంగా జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమంటూ జేఎంఎం ప్రచారంలో హోరెత్తిస్తోంది. బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తోంది. ఆరో విడత స్థానాలపై ఫోకస్... ధన్‌బాద్ బొగ్గు గనుల స్థావరం. ఇక్కడి ఓటర్లలో 62 శాతం పట్టణవాసులే. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 8 శాతముంటారు. యూపీ, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. 2009 నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎంపీ పశుపతినాథ్ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యే దుల్లు మహతోకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్ పోటీ పడుతున్నారు. వీరిపై రెండు పారీ్టల్లోనూ అసంతృప్తే ఉంది. బీఎస్పీ, సమతా, ఆజాద్ సమాజ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా వంటి పారీ్టలు, స్వతంత్రులు... ఇలా మరో డజను మంది బరిలో ఉన్నారు.జంషెడ్పూర్ దీన్ని టాటా నగర్, స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ అతిపెద్ద ప్లాంట్ ఇక్కడ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బిద్యుత్ బరణ్ మహతో హాట్రిక్‌పై కన్నేశారు. 2019లో ప్రస్తుత సీఎం చంపయ్ సోరెన్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగికి టికెటివ్వకపోవడం ఒడిశావాసుల ఓట్లపై ప్రభావం చూపేలా ఉంది. కాకపోతే కురి్మ–మహతో ఓటర్లు 3 లక్షలకు పైగా ఉండటం మహతోకి కలిసొచ్చే అంశం. 27 శాతమున్న ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం నుంచి సమీర్‌కుమార్ మొహంతీ బరిలో ఉన్నారు.రాంచీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ సేత్‌ను కాదని 2014లో గెలిచిన రామ్ తహాల్ చౌదరికి బీజేపీ ఈసారి టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సు¿ోద్కాంత్ సహాయ్ కుమార్తె, ప్రముఖ న్యాయవాది. యశస్వి పోటీ చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే ఎంపీగా సంజయ్ పనితీరుపై ఏకంగా 73 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు గతేడాది ఓ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఆయన బలమైన గళంగా నిలుస్తున్నారు.గిరిధ్ బీజేపీకి బలమైన స్థానమిది. పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)కు విడిచిపెట్టింది. ఏజేఎస్‌యూ సిట్టింగ్ ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో బరిలో ఉన్నారు. వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్థి జైరాం కుమార్ మహతో గట్టి సవాల్ విసురుతున్నారు. ముగ్గురు నేతలూ కుర్మి సామాజికవర్గీయులే. టైగర్ జైరాంగా పిలిచే జైరాం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
103 మంది సిట్టింగులకు... ఈసారి నో టికెట్
లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయంపై కన్నేసిన అధికార బీజేపీ అందుకోసం తీవ్రస్థాయి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. గెలుపు అవకాశాలు లేవనుకుంటే ఎవరినైనా పక్కన పెట్టేస్తోంది. ఎంతటి సీనియర్లయినా, ఎంత జనాదరణ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఆ క్రమంలో మొత్తం 290 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే ఏకంగా 103 మందికి బీజేపీ టికెట్ నిరాకరించింది...! బీజేపీ ఇప్పటిదాకా ఆరు విడతల్లో 405 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు కూడా రాకముందే మార్చి 2న ఏకంగా 195 మందితో తొలి జాబితాను ప్రకటించడం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి పొత్తులపై, పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓవైపు మల్లగుల్లాలు సాగుతుండగానే భారీ జాబితా వెలువరించి దూకుడు కనబరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు అందులో చోటుచేసుకున్నారు. తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. ఇక 72 మందితో ప్రకటించిన రెండో జాబితాలో ఏకంగా 30 మంది సిట్టింగులపై వేటు పడింది! మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తర్వాత మార్చి 24న 111 మందితో ప్రకటించిన ఐదో జాబితాలోనైతే 37 మంది సిట్టింగులకు టికెట్లు గల్లంతయ్యాయి! తాజాగా మంగళవారం ప్రకటించిన మూడు స్థానాల్లోనూ సిట్టింగులను పక్కన పెట్టి ఇతరులకు టికెట్లిచ్చింది. వీరిలో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ కూడా ఉండటం విశేషం. ఈ లెక్కన ఇప్పటికే మూడో వంతుకు పైగా, అంటే 34 శాతం మంది బీజేపీ సిట్టింగులను టికెట్లు దక్కలేదు. మరో 30 నుంచి 40 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దించేలా కని్పస్తోంది. వాటిలోనూ మరింతమంది సిట్టింగులను మార్చడం ఖాయమంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 282 మంది బీజేపీ సిట్టింగుల్లో 119 మందికి టికెట్లివ్వలేదు. అంటే ఏకంగా 42 శాతం మందిని మార్చేసింది! తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించగలిగామన్నది బీజేపీ అగ్ర నాయకత్వం అభిప్రాయం. అందుకే ఇప్పుడూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. టికెట్లు దక్కని ప్రముఖులు హర్షవర్ధన్, వరుణ్గాందీ, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, వీకే సింగ్, అనంత్‌కుమార్ హెగ్డే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, అశ్వినీ చౌబే, ప్రతాప్ సింహ... ఇలా ఈసారి టికెట్ల దక్కని బీజేపీ సిట్టింగుల్లో పలువురు సీనియర్లు, ప్రముఖులున్నారు. వీరిలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అయితే పార్టీ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురై ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పేశారు. ఇక ప్రజ్ఞాసింగ్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెడ్గే, పర్వేష్ సాహిబ్‌సింగ్ వంటి ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వేటు పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
టెస్టింగ్ టైమ్: బీజేపీ ఎంపీల పనితీరు మదింపు
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. పార్టీ ఎంపీల పనితీరును 16 అంశాల ప్రామాణికంగా మదింపు చేసేందుకు సంసిద్ధమైంది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎంపీలకు పార్టీ టికెట్ దక్కుతుంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొందాలంటే సీనియారిటీ, ప్రతిష్టలను పక్కన పెట్టి ఎంపీలంతా హైకమాండ్ మదింపులో నెగ్గుకురావాల్సిందే. పార్టీకి చెందిన 282 మంది ఎంపీల పనితీరుపై స్వతంత్ర ఆడిట్‌కు తొలిసారిగా బీజేపీ సన్నద్ధమైంది. పార్టీ ఎంపీల పనితీరును మదింపు చేసే బాధ్యతను ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. దేశరాజధానిలోని ఏడు బీజేపీ ఎంపీల పనితీరును విశ్లేషిస్తూ ఈ ఏజెన్సీ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఎంపీల పనితీరుపై నివేదికలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తారు. ఢిల్లీ ఎంపీలపై విశ్లేషణ నివేదిక త్వరలో అందనుండటంతో తదుపరి ఇతర రాష్ట్రాల ఎంపీల పైనా ఈ కసరత్తు చేపడతారు. మొత్తం ప్రక్రియ 2018, డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. పార్లమెంట్‌కు ఎంపీల హాజరు, తమ నియోజకవర్గాల పర్యటనలు వంటి పలు అంశాల ఆధారంగా ఎంపీల పనితీరును మదింపు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ పనితీరు, వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగా సిట్టింగ్ ఎంపీల విజయావకాశాలనూ ఈ ఆడిట్ బేరీజు వేస్తుందని వెల్లడించాయి. ప్రజల్లో సిట్టింగ్ ఎంపీకి ఇప్పటికీ ఆదరణ ఉన్నదా అనేది నిగ్గుతేల్చాలన్నది ఏజెన్సీకి ముఖ్యమైన బాధ్యతగా అప్పగించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
సిట్టింగ్ లకే టికెట్
ఎంపీ అభ్యర్థులపై టీపీసీసీ జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేత సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లుగానే.. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి సమర్పించిన జాబితాలో సిట్టింగ్ ఎంపీల పేర్లున్నారుు. ఆ జాబితాలో ఒక్కో నియోజకవర్గం నుంచి పలువురి పేర్లను సిఫారసు చేశారు. అందులో ఏఐసీసీ, పీసీసీ (ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ), టీపీసీసీ, డీసీసీలు సిఫారసు చేసిన వారి పేర్లనూ ఆ వివరాలతో సహా పొందుపరిచారు. అలాగే.. ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించిన వారి పేర్లను ‘గాంధీభవన్’ పేరుతో జాబితాలో చేర్చారు. రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు తెలంగాణలో పార్టీ అభ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తును వేగవంతం చేసింది. తొలుత లోక్‌సభ అభ్యర్థులపై ప్రధాన దృష్టిని సారించింది. రెండు రోజుల్లో కసరత్తును పూర్తి చేసి తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఆ వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదానికి పంపి 28వ తేదీకల్లా ఎంపీల జాబితాను ప్రకటించాలని యోచిస్తోంది. జాబితాలోని ముఖ్యాంశాలివీ... కోమటిరెడ్డి సీటు పొన్నాలకు..! కాంగ్రెస్ నేతలు ఊహించినట్లుగానే భువనగిరి సిట్టింగ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మాత్రం మొండిచేయి చూపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరును భువనగిరి అభ్యర్థిగా మొదటగా సిఫారసు చేశారు. ఇటీవల నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో పొన్నాలతో పాటు నలుగురు పేర్లను రూపొందించగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. టీపీసీసీ జాబితా విషయానికొస్తే మాత్రం కోమటిరెడ్డి పేరును తొలగించేశారు. ఆయన స్థానంలో పొన్నాల కోడలు వైశాలి పేరును చేర్చారు. రాజగోపాల్‌రెడ్డి పేరు జాబితాలో లేకపోవటంపై పార్టీ నేతల్లో పెద్ద చర్చనీయాంశమైంది. టీపీసీసీ వర్గాలు మాత్రం హైకమాండ్ పెద్దల ఆదేశాల మేరకే ఆయన పేరును జాబితాలోంచి తప్పించినట్లు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హైకమాండ్‌కు ప్రత్యేకించి సోనియాగాంధీకి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నాయి. దీనికితోడు ఇతర పార్టీలతో వారు సన్నిహితంగా ఉన్నారనే సమచారం కూడా రావడంతో ఆయన పేరును జాబితా నుంచి తొలగించారని వెల్లడించాయి. సోనియాగాంధీ జోక్యం చేసుకుంటే తప్ప రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టంచేశాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన తమకు టిక్కెట్లు రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీనివెనుక టీపీసీసీ పొన్నాల లక్ష్మయ్య ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. సిట్టింగ్లందరి పేర్లూ సిఫారసు... రాజగోపాల్‌రెడ్డి మినహా తెలంగాణ కాంగ్రెస్ సిట్టింగులందరి పేర్లను సిఫారసు చేయడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా వెళ్లిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, సిరిసిల్ల రాజయ్య పేర్లను కూడా జాబితాలో మొదటి వరుసలోనే చేర్చారు. పొన్నం ప్రభాకర్‌తోపాటు గతంలో పెద్దపల్లి (ఎస్సీ) ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన గోమాస శ్రీనివాస్, తెలంగాణ రాజకీయ జేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, కె.రామకృష్ణల పేర్లను చేర్చడం గమనార్హం. అయితే వారి పేర్లను పెద్దపల్లి నియోజకవర్గ జాబితాలో చేర్చాల్సి ఉండగా.. పొరపాటు కరీంనగర్ జాబితాలోకి వెళ్లినట్లు పీసీసీ వర్గాలు వివరణ ఇచ్చాయి. దీంతో పొన్నం ప్రభాకర్ పేరును మాత్రమే కరీంనగర్ అభ్యర్థిగా టీపీసీసీ ప్రతిపాదించినట్లయింది. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కోరుకున్నట్లుగానే ఆయన మహబూబ్‌నగర్ బరిలో దిగడానికి హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎంపీగా చేవెళ్ల అభ్యర్థిగా జైపాల్ పేరును చేర్చిన టీపీసీసీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా మొదటి వరుసలో పొందుపరచడం విశేషం. టీడీపీ ఎమ్మెల్యే రాములుకు కాంగ్రెస్ టికెట్..! జైపాల్‌రెడ్డి సూచన మేరకు తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీమంత్రి పి.రాములును నాగర్‌కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న రాములు పేరును కాంగ్రెస్ జాబితాలో చేర్చడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన జైపాల్‌రెడ్డి ద్వారా ఏఐసీసీ పెద్దలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఎస్సీ సామాజికవర్గ టిక్కెట్ల కేటాయింపు బాధ్యతను చూస్తున్న ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుతోనూ ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీచేయాలని ఏఐసీసీ పెద్దలు ప్రతిపాదించడం, అందుకు రాములు అంగీకరించడంతో టీపీసీసీ జాబితాలో మొదట ఆయన పేరును చేర్చారు. మెదక్ ఎంపీ సీటుకు టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి పేరును సిఫారసు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటుబరిలోకి దింపాలని ప్రతిపాదించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతంకు తొలుత చొప్పదండి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పంపాలని భావించారు. తాజాగా ఆయన పేరును పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి సిఫారసు చేయడం విశేషం.