sivalingapuram
-
యాక్షన్ ఎంటర్టైనర్
తమిళ, మలయాళ భాషల్లో యాక్షన్ హీరోగా చేసిన ఆర్.కె.సురేశ్ ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకటస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుబాల కథానాయిక. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –‘‘అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో’ వంటి సినిమాలు తీశాను. మేము పెరిగిన లొకేషన్లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వెంకటస్వామి. ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచాను. అన్న, చెల్లెలి సెంటిమెంట్ హైలైట్ అవుతుంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
జొరమొచ్చినా...పట్టించుకోలేదు..!
ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆవేదన పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీపీ, సర్పంచ్ అనంతగిరి : జొరమొచ్చినా పట్టించుకోలేదు...ఆస్పత్రికి తీసుకెళ్లలేదు...ఇంటికెళ్దామన్నా పంపించలేదు....అంటూ శివలింగాపురం ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తుండడంతో జ్వరంతో ఇంటికి వెళ్లలేక, పాఠశాలలో ఉండలేక ఏంచేయాలో తెలియడం లేదన్నారు. స్థానిక ఎంపీపీ పైడితల్లి శనివారం ఆ పాఠశాలను తనిఖీ చేసినపుడు విద్యార్థుల దుస్థితిని గమనించారు. వారం రోజులుగా తాము జ్వరాలతో బాధపడుతున్నా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని విద్యార్థులు తెలిపారు. కాగా ఎంపీపీ తనిఖీ నిర్వహించిన సమయంలో వార్డెన్, హెచ్ఎం కూడా పాఠశాలలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం శివలింగపురం ఆశ్రమ పాఠశాలలో సమర్డి తిరుపతి, మామిడి కృష్ణ, గెమ్మేల జయరాజు, కిల్లో అరుణ్ కుమార్, గరం వికాష్లతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇది గమనించిన ఎంపీపీ పైడితల్లి, సర్పంచ్ దుడ్డు సోములు వైద్యాధికారులకు సమాచారం అందించి వైద్య సహాయం అందించారు. ఇదిలా ఉండగా వసతిగృహల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని, సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్ఎం, వార్డెన్లను ఎంపీపీ హెచ్చరించారు.