ఆరు లక్షల మందికి పల్స్‌పోలియో
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఆరు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యశాఖ మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రభుత్వ ఆస్పతిలో కలెక్టర్ నందగోపాల్ అధ్యక్షతన మంత్రి కేసీ వీరమణి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 73,971 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకుగాను 2216వ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 9,157 మంది సిబ్బంది, 305 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఆదివారం చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం వైద్య సిబ్బందిచే మూడు రోజుల పాటు ఇంటింటికి వెల్లి చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అస్లాంబాషా, మున్సిపల్ చైర్మన్ సంగీత పాల్గొన్నారు. అలాగే వేలూరు పెడ్‌లాండ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ విజయ్, మేయర్ కార్తియాయిని పోలియో చుక్కలను వేశారు. వీరితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తిరువణ్ణామలై జిల్లాలో
జిల్లాలో రెండు లక్షల 28,069 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు కలెక్టర్ జ్ఞానశేఖరన్ తెలిపారు. ఇందుకోసం 1,885 పోలియో కేంద్రాలు, 866 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో చుక్కలను కలెక్టర్ ప్రారంభించారు. అలాగే సెయ్యారు ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి ముక్కూరు సుబ్రమణియన్ పల్స్ పోలియోను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధి కారులు పాల్గొన్నారు.