6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు | mla chinthala ramchandra reddy speech in assembly about double bedroom scheam | Sakshi
Sakshi News home page

6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు

Published Wed, Mar 30 2016 4:32 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు - Sakshi

6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు

సీఎం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారు: బీజేపీ ఎమ్మెల్యే చింతల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకోసం ఆరు లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారని, ముఖ్యమంత్రి మాత్రం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కట్టిస్తానన్న లక్ష ఇళ్లకైనా బడ్జెట్లో నిధులు కే టాయించారా? అంటే.. ఎక్కడా ఆ ప్రస్తావనే లేదన్నారు. తాజా బడ్జెట్‌లో కూడా రూ.30 వేల కోట్ల లోటు తప్పదన్నారు. డబుల్ బెడ్రూంల విషయమై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. లక్ష ఇళ్లు 100శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిర్మిస్తుందని, కొంత వ్యయాన్ని భరించగలిగిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో రెండు రకాలుగా ఇళ్లు నిర్మిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement