chintala ramchandra reddy
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు గోపాల్, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి తదితరులు బుధవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామని, కోవిడ్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందిస్తున్న ఫలాలు చూసి ప్రధాన ప్రతిపక్షం రాక్షస ఆనందం పొందుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిద్ధం అవుతుంటే కోర్టులు ద్వారా అడ్డుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి అనుగ్రహం ఉందని, డిక్లరేషన్ పేరుతో వివాదం చేసి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి మాట్లాడుతూ ‘మైసూర్ మహారాజు కాలం నుండి తిరుమలలో 7 ఎకరాల్లో కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ ఉన్నాయి. 14 శతాబ్దం నుండి కర్ణాటక భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేవారు. ప్రభుత్వం తరపున ప్రతిరోజు శ్రీవారికి నిత్య హారతి అందిస్తారు. 1964లో అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి కర్ణాటక సత్రాలకు భూమిపూజ చేశారు. ఇప్పుడు రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ఛారిటీస్‌కు సంబంధించి 5 కాంప్లెక్స్‌లు నిర్మించనున్నాం. రోజుకు 1800 మంది భక్తులకు వసతి కలిగించేలా నిర్మాణం చేపట్టనున్నాం. రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప భూమిపూజ చేయనున్నారు’ అని తెలిపారు. ఇక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వరదుడు, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం మోహినీ రూపంలో పల్లకిలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అమృతాన్ని దేవతలు అందరికి దక్కేలా చేసిన అవతారమిది. సాక్షాత్తు పరమశివుడు సైతం సమ్మోహన పరిచిన మోహినీ రూపంలో పల్లకీలో ఎదురుగా అద్దంలో తన ముగ్ద మనోహరమైన సుందర రూపాన్ని చూసి మురిసిపోతూ ఊరేగుతూ పల్లకీలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనమిచ్చారు. -
6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు
సీఎం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారు: బీజేపీ ఎమ్మెల్యే చింతల సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకోసం ఆరు లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారని, ముఖ్యమంత్రి మాత్రం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కట్టిస్తానన్న లక్ష ఇళ్లకైనా బడ్జెట్లో నిధులు కే టాయించారా? అంటే.. ఎక్కడా ఆ ప్రస్తావనే లేదన్నారు. తాజా బడ్జెట్లో కూడా రూ.30 వేల కోట్ల లోటు తప్పదన్నారు. డబుల్ బెడ్రూంల విషయమై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. లక్ష ఇళ్లు 100శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిర్మిస్తుందని, కొంత వ్యయాన్ని భరించగలిగిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో రెండు రకాలుగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. -
మురుగుకాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లు
బంజారాహిల్స్(హైదరాబాద్): రాజధాని నగరంలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి మహిళలతో సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీవాసుల సమస్యలను తీర్చేందుకు ఇకపై నెలలో రెండు రోజులు కేటాయిస్తానని వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా అందరూ సహకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామనడంలో ఏ మాత్రం సందేహం లేదని పేర్కొన్నారు. వానాకాలం సమీపిస్తున్నందున మురుగు కాల్వల్లో పూడికను తొలగించే కార్యక్రమం చేపట్టాలని జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాజకీయ నేతలు, కళాకారులు, నటులు, క్రీడాకారులు, ప్రముఖులు స్వచ్ఛ్ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఓ అడుగు ముందుకేశారు. అంతా రోడ్లను శుభ్రపరుస్తుంటే ఆయన మాత్రం మరుగుదొడ్లను శుభ్రపరచి అందరినీ ఆశ్చర్యపరిచారు. శుక్రవారం ఫిల్మ్ నగర్ రౌండ్ టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరుగుదొడ్లను శుభ్రపరిచారు. సుమారు గంటపాటు అక్కడి మూత్రశాలలను కడిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఇక నుంచి ప్రతి శనివారం రాజ్ భవన్ పరిసరాలు శుభ్రం చేయాలని గవర్నర్ నరసింహన్ ...సిబ్బందికి పిలుపునిచ్చారు. ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తే తానూ పాల్గొంటానని గవర్నర్ తెలిపారు.