మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల | swatchh bharat: bjp mla chintala ramchandra reddy cleans toilets in government school | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల

Published Sat, Nov 8 2014 8:52 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల - Sakshi

మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాజకీయ నేతలు,  కళాకారులు, నటులు, క్రీడాకారులు, ప్రముఖులు స్వచ్ఛ్ కార్యక్రమంలో  పాల్గొంటున్న విషయం తెలిసిందే.  స్వచ్ఛ్ భారత్లో భాగంగా ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఓ అడుగు ముందుకేశారు.

 

అంతా రోడ్లను శుభ్రపరుస్తుంటే ఆయన మాత్రం మరుగుదొడ్లను శుభ్రపరచి అందరినీ ఆశ్చర్యపరిచారు. శుక్రవారం ఫిల్మ్ నగర్ రౌండ్ టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరుగుదొడ్లను శుభ్రపరిచారు. సుమారు గంటపాటు అక్కడి మూత్రశాలలను కడిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.

మరోవైపు ఇక నుంచి ప్రతి శనివారం రాజ్ భవన్ పరిసరాలు శుభ్రం చేయాలని  గవర్నర్ నరసింహన్ ...సిబ్బందికి పిలుపునిచ్చారు. ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తే తానూ పాల్గొంటానని గవర్నర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement