నిజామాబాద్ జిల్లా నుంచి పాత బాలప్రసాద్: వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగానికి వృద్ధులు నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. మరుగుదొడ్లలో మలవిసర్జన చేయడం వాళ్లకు ముందు నుంచీ’ అలవాటు లేకపోవడంతో వీటిని వినియోగిం చడం లేదని వృద్ధులు చెబుతున్నారు. వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ, ట్రాన్స్‌పరెన్సీ (ఎస్‌ఎస్‌ఏఏపీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సామాజిక తనిఖీ జరుగుతోంది. ప్రత్యేక ఆడిట్ బృందాలు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? కుటుంబసభ్యులందరూ వాడుతున్నారా? వంటి వివరాలు సేకరిస్తున్న సమయంలో వృద్ధులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం బయటపడింది. ఇప్పటికే వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ సామాజిక తనిఖీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి.
స్వచ్ఛభారత్ మిషన్ కింద..
బహిరంగ మల విసర్జనతో అంటు వ్యాధులు ప్రబలి.. ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉపాధిహామీ పథకం కింద కూడా లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తోంది.
మరుగుదొడ్లు నిర్మించుకున్న
ప్పటికీ చాలా కుటుంబాలు వాటిని వినియోగించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కుటుంబంలో ఒకరిద్దరు బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు వీరి పరిశీలనలో తేలింది.
రాష్ట్రంలో మరుగుదొడ్ల వినియోగంపై 2012లో ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 43.91 లక్షల కుటుంబాల్లో 11.49 లక్షల కుటుంబాలకే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్న ట్లు తేలింది. మిగిలిన 32.42 లక్షల కుటుంబా లు కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభు త్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇప్ప టివరకు 16.42 లక్షల టాయిలెట్స్ నిర్మించారు.
ఇదీ మరుగుదొడ్ల లెక్క..
మరుగుదొడ్లు ఉన్న కుటుంబాలు : 11.49 లక్షలు (2012 సర్వే)
ఐదేళ్లలో నిర్మించిన మరుగుదొడ్లు : 16.42 లక్షలు
ఓడీఎఫ్ జిల్లాలు : నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్,
మేడ్చల్, రాజన్న సిరిసిల్ల
ఆరు జిల్లాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగినట్లు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రకటించింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్లలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) జిల్లాలుగా పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించు కునేలా లబ్ధిదారులను ప్రోత్సహించారు. నిర్మించు కోని వారికి పింఛన్లు, రేషన్ సరుకులు నిలిపివేస్తామనీ ప్రకటించారు. దీంతో అన్ని కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment