మరుగుదొడ్ల వేగవంతానికి అధికారుల నియామకం | Appointment of officers to speed up toilets | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల వేగవంతానికి అధికారుల నియామకం

Published Wed, Aug 9 2017 11:12 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Appointment of officers to speed up toilets

అనంతపురం టౌన్‌ (అనంతపురం): స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద డ్వామాకు కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో  ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ 28,710 యూనిట్లు కేటాయించారని, వీటిని ఈనెల 19లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళ్యాణదుర్గం డివిజన్‌కు రాజేంద్రప్రసాద్, కదిరి డివిజన్‌కు విజయ్‌కుమార్, పెనుకొండకు నరసింహారెడ్డి, ధర్మవరానికి చంద్రశేఖర్‌రావు, అనంతపురానికి రంగన్నను నియమించామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. రోజు వారీ నివేదికలను తెప్పించుకుని గడువులోగా లక్ష్యం సాధిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement