ski accident
-
ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్‌కు గాయాలు
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ సంగీత గాయని మిరందా లాంబర్ట్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ ఈస్ట్ (27) గాయపడ్డాడు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా వారిద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు అతడు స్కేటింగ్ చేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో గాయపడ్డాడు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలకు వారిద్దరు దూరం కావాల్సివచ్చింది. కానీ, ఈ ప్రమాదం మాత్రం వారిద్దరినీ మరింత దగ్గరచేసినట్లు ఆ అమ్మడు మురిసిపోతోంది. గాయపడిన అతడిని స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమేకాకుండా ప్రస్తుతం దగ్గరుండి సపర్యలు చేస్తుందట. 'కొత్త సంవత్సర వేడుకల్లో తన బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ తో కలిసి మిరందా పాల్గొంది. అయితే, స్కేటింగ్ చేస్తుండగా అతడు స్వల్పంగా గాయపడ్డాడు. చిన్నగాయమే అయినప్పటికీ అతడిని ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లింది. సేవలు చేస్తోంది. వారు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఆమె స్వయంగా అతడికి సపర్యలు చేస్తూ మురిసిపోతుంది' అని స్థానిక మేగజిన్ ఒకటి పేర్కొంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే లాంబర్ట్ అతడితో గత నెల రోజుల నుంచే డేటింగ్ చేస్తుందట. కొన్ని విభేదాల కారణంగా ఆమె గాయకుడు బ్లేక్ షెల్టాన్ తో విడిపోయింది. ఆండర్సన్ ఈస్ట్ కూడా ఓ గాయకుడే. -
షుమాకర్ పరిస్థితి కాస్త మెరుగే కానీ...
ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తున్న షుమాకర్ ఆదివారం ప్రమాదవశాత్తు రాయిని గుద్దుకున్నారు. ఆ ప్రమాదంలో ఆయన మొదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ఆ ప్రమాదంలో షుమాకర్ మొదడులో రక్తం గెడ్డ కట్టింది. దీంతో ఆయనకు వైద్యులు రెండు సార్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే షుమాకర్ పరిస్థితి మెరుగ్గా ఉందని, అదే సమయంలో కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే షుమాకర్ ప్రమాదంపై మీడియాలో వస్తున్న పలు వరుస కథనాలను ఆయన మేనేజర్ సబీన్ కెమ్ ఖండించారు. స్కీయింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఆయన తలకు రాయి తగలడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. షుమాకర్ తలకు హెల్మెట్ ధరించి స్కైయింగ్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే హెల్మెట్‌కు రాయి తగలడంతో అది రెండు ముక్కలు అయిందని వెల్లడించారు. 44 ఏళ్ల షుమాకర్ ఇప్పటివరకు ఫార్ములా వన్ రేసులో ఏడు ప్రపంచ చాంపియన్ షిప్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
కొద్దిగా మెరుపడ్డ షుమాకర్ ఆరోగ్యం
గ్రెనోబల్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ డ్రైవింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. అయితే ప్రాణాప్రాయం తప్పిందని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. అతడికి చేసిన రెండో ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు. షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగయిందన్నారు. ఇప్పటికే అతడి మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. ఫార్ములావన్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నీరాజనాలు అందుకున్నషుమాకర్ ఆదివారం స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆల్ఫ్స్‌లోని మెరిబెల్ రిసార్ట్‌లో 14 ఏళ్ల తన కుమారుడితో కలిసి స్కీయింగ్ చేస్తుండగా షుమాకర్ తలకు దెబ్బ తగిలింది. దీంతో అతడు కోమాలోకి వెళ్లాడు. 1991లో ఎఫ్1లో అరంగేట్రం చేసిన తను అందరికన్నా ఎక్కువగా ఏడుసార్లు ఫార్ములావన్ టైటిళ్లు, 91 రేసులు నెగ్గి చరిత్ర సృష్టించాడు. 2004లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన తను గతేడాది పూర్తిగా రేస్ నుంచి తప్పుకున్నాడు. వచ్చే శువ్రారం తను 45వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు.