షుమాకర్ పరిస్థితి కాస్త మెరుగే కానీ...
ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తున్న షుమాకర్ ఆదివారం ప్రమాదవశాత్తు రాయిని గుద్దుకున్నారు. ఆ ప్రమాదంలో ఆయన మొదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ఆ ప్రమాదంలో షుమాకర్ మొదడులో రక్తం గెడ్డ కట్టింది. దీంతో ఆయనకు వైద్యులు రెండు సార్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే షుమాకర్ పరిస్థితి మెరుగ్గా ఉందని, అదే సమయంలో కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అయితే షుమాకర్ ప్రమాదంపై మీడియాలో వస్తున్న పలు వరుస కథనాలను ఆయన మేనేజర్ సబీన్ కెమ్ ఖండించారు. స్కీయింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఆయన తలకు రాయి తగలడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. షుమాకర్ తలకు హెల్మెట్ ధరించి స్కైయింగ్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే హెల్మెట్కు రాయి తగలడంతో అది రెండు ముక్కలు అయిందని వెల్లడించారు. 44 ఏళ్ల షుమాకర్ ఇప్పటివరకు ఫార్ములా వన్ రేసులో ఏడు ప్రపంచ చాంపియన్ షిప్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.