Skipping
-
Israel-Hamas war: ఓటింగ్‌కు దూరం సరికాదు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ పోరుపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. ‘‘హమాస్ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. కానీ ప్రతీకారం పేరుతో నిస్సహాయులైన ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వినాశనానికే దారి తీస్తున్నాయి. పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా శాంతియుతంగా సహజీవనం చేసేలా నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరగాలన్నదే ఈ సమస్యపై కాంగ్రెస్ వైఖరి అని సోనియా గుర్తు చేశారు. సోమవారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. గాజాను అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్ చెరబట్టిన తీరు ఆ ప్రాంతాన్ని ఓపెన్ జైలుగా మార్చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. -
Viral Video: తగ్గేదేలే..! స్కిప్పింగ్‌లో కుక్క గిన్నిస్ వరల్డ్ రికార్డు
-
Health: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఈ విషయాలు తెలిస్తే
Skipping- Health Benefits: వర్కవుట్స్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. అయితే అందరూ వర్కవుట్స్ చేయలేరు. అలాగని వర్కవుట్స్ చేయకుంటే స్థూలకాయంతో సహా రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ తలనొప్పంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అలాంటి వ్యాయామాలలో స్కిప్పింగ్ ఒకటి. దీనినే ఒకప్పుడు తాడాట అనేవాళ్లు. ఇప్పుడు స్కిప్పింగ్ అంటున్నారు. స్కిప్ చేయకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవి కూడా చేయకుండా స్కిప్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్‌ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారు... అనుకునేవారు కాస్త ఆగండి.. జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్నెస్ నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. సులువుగా బరువు తగ్గచ్చు స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్ కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్ వల్ల నిమిషాలను 15 నుంచి 20 కేలరీలను బర్న్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. గుండె బాగుంటుంది స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగు స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బద్దకాన్ని వదిలిస్తుంది స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయండి. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ముందుంటుంది. ఎందుకంటే ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.. స్కిప్పింగ్ చేసే అలవాటు మీకు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా స్కిప్పింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేయించండి. వారితోపాటు మీరు కూడా పోటీ పడి స్కిప్పింగ్ చేస్తూ ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండండి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
వైరల్ వీడియో : మనిషినే తాడుగా తిప్పుతూ...!
-
మనిషినే తాడుగా తిప్పుతూ.. నిమిషంలో 57 సార్లు స్కిప్పింగ్ చేసి రికార్డ్
శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్‌నెస్‌కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. రోజువారీగా స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అంతేగాక దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డునే సృష్టించారు . దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డ్స్ వాళ్లు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో పోటీపడే వాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడ్డారు. అయితే సాధారణ తాడుతో ఆడి కాకుండా వినూత్నంగా రికార్డ్ క్రియేట్ చేశారు. తాడుకు బదులు మనిషిని ఉపయోగిస్తూ స్కిప్పింగ్ చేశారు. మనిషిని పైకి కిందకు తిప్పుతూ కేవలం నిమిషంలో ఏ జట్టు ఎక్కవసార్లు స్కిప్‌లు చేస్తే వారు విజేతలుగా నిలిచినట్లు అవుతుంది. ఇందులో యూకేకు చెందిన అక్రోపోలిస్(బ్లూ డ్రెస్) అనే జట్టు, వైల్డ్ క్యాట్స్ చీర్ టీమ్‌తో తలపడింది. అయితే నిమిషంలో 57 సార్లు స్కిప్‌లు పూర్తి చేసి యూకే టీం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘వావ్.. అద్భుతం’ అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు.. ‘ఇది పూర్తయిన తరువాత ఆ అబ్బాయి పాపం వాంతి చేసుకుని ఉంటాడు. బాలుడి తల నేలకు తాకితే ఎంత ప్రమాదం.. దయచేసి ఇలాంటివి అనుకరించవద్దు’ అని సూచిస్తున్నారు. The cheapest skipping rope is a human one... Which team can get in the most skips in one minute? pic.twitter.com/6GJWsj9nAN — Guinness World Records (@GWR) October 21, 2022 -
సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా?
సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సన్నగా, పీలగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్లు చేయాలి. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్ కన్నా స్ట్రెంత్ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా సరే బెల్లీ బలంగా మారాలంటే క్రంచెస్ చేయాలి. మీ సామర్థ్యాన్ని బట్టి 20 సార్లు 3 సెట్లు లేదా 15 సార్లు 4 సెట్లు రోజూ చేస్తే మంచి ఫలితం తొందరగా కనిపిస్తుంది. స్కిప్పింగ్ ఇలా చేద్దాం! పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ఎనిమిది నిమిషాల నడకకు సమానం. స్కిప్పింగ్‌కు మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు రెండింతలుండాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో ముందుకు, వెనక్కు తిప్పి చూసుకోవాలి. అప్పుడే కాళ్లకు అడ్డం పడకుండా క్రమపద్ధతిలో స్కిప్పింగ్ చేయగలరు. ఒకేవిధమైన ఎక్సర్సైజ్లు కాకుండా కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, మిలటరీ ప్రెస్, డంబెల్ రో ప్రయత్నించడం వల్ల కండరాలు పటిష్ఠంగా తయారై, తీరైన ఆకృతిలోకి మారతాయి. మొదటి రోజునుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టొద్దు, మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్నెస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వావ్.. వాకింగ్! క్రమం తప్పక వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోనులు విడుదలవుతాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రెగ్యులర్ వాకింగ్‌తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ అరగంట వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుంది, నిత్యం 10 వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. బూట్లు లేకుండా ఒట్టి పాదాలతో చేసే వాకింగ్‌తో మెంటల్ టెన్షన్ తగ్గుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, హృద్రోగాల రిస్కు తగ్గుతుందని, మెన్సస్ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పులు నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ చదవండి: కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే..! -
కరోనా కట్టడికి ‘స్కిప్పింగ్’ ఓ ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నప్పుడు పిల్లలంతా ఆడ, మగ తేడా లేకుండా ఆడుకునే ‘స్కిప్పింగ్ (తాడు ఆట)’ మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. స్కిప్పింగ్ తాడును ఎక్కడికైనా, ఎప్పుడైనా తీసుకెళ్లే వీలు ఉండడమే కాకుండా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసే సరాదా ఆట కూడా కావడం దీనికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. అందుబాటు ధరలో లభించే స్కిప్పింగ్ తాడుల వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండడం కూడా ప్రాచుర్యానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు బాక్సింగ్ ట్రేనింగ్‌లో బాక్సర్ల ఫుట్‌వర్క్‌ను మెరగుపర్చేందుకు స్కిప్పింగ్ శిక్షణ ఇచ్చేవాళ్లు. సాధారణ ఆరోగ్యాన్ని మెరగుపరుచుకోవడానికీ ఉపయోగించేవారు. రోజూ పది నిమిషాలు స్కిప్పింగ్ చేసినట్లయితే రక్త పీడనం తగ్గడమే కాకుండా గుండె రక్త ప్రసరణ మెరగు పడుతుంది. వేగంగా గుండె కొట్టుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలోకి ఆక్సీజన్ ఎక్కువగా ప్రసరించి ఇతర అవయవాలతోపాటు గుండె పనితీరు మెరగు పడుతుంది. (చదవండి : కరోనా: దేశవ్యాప్తంగా 36 లక్షలు దాటిన కేసులు) కోవిడ్ రోగుల శరీరాల్లో ఆక్సిజన్ శాతం పడిపోవడం ప్రాణాంతకం అవుతున్న విషయం తెల్సిందే. స్కిప్పింగ్ వల్ల పేంక్రియాస్లోని బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి ఇనుమడిస్తుంది. దాంతో మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక్క భుజాలు, చేతుల మణికట్లు, కాళ్ల కండరాలు బలోపేతం కావడమే కాకుండా పొత్తి కడుపు వద్ద కండరాలు కూడా బల పడతాయి. పొట్ట తగ్గుతుంది. స్కిప్పింగ్ వల్ల శరీరంపైనా మంచి పట్టు లభిస్తుందని, దాని వల్ల అరుగులపై నుంచి, మెట్ల పై నుంచి, సైకిళ్లపై నుంచి పిల్లలు పట్టు తప్పి పడిపోవడం ఉండదని కూడా ఓ పరిశోధనలో తేలింది. శరీరంలోని అణువణవు మధ్య మంచి సమన్వయం తీసుకరావడానికి, శరీరంలోని ప్రతి అవయంపై మనకు పట్టు ఉండేందుకు రకరకాల స్కిప్పింగ్ మెలకువలు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయని ఫిట్నెస్ అధ్యాపకులు తెలియజేస్తున్నారు. (చదవండి : కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే..!) స్కిప్పింగ్ వల్ల శరీరంలోని ఎముకులు బలపడడమే కాకుండా వాటి మందం కూడా పెరగుతుందని, వృద్ధాప్యంలో ఎముకలు కరగడం మొదలైనప్పుడు ఎముకలు మందం పెరగడం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వృద్ధాప్యంలో పడిపోవడం వల్ల తొడ ఎముక విరిగి మంచానికి అంకితమయ్యేవారు లేదా ఎక్కువ మంది మరణించడం మనకు తెల్సిందేనని, స్కిప్పింగ్ వల్ల తొడ ఎముకలు, కండరాలు బలపడతాయని, ఆ కారణంగా కింద పడిపోయినా ఎముకలు విరిగే అవకాశాలు తక్కువవుతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. శరీర అవయవాలు వేగంగా కదిలేందుకు కూడా స్కిప్పింగ్ తోడ్పడుతుంది. స్కిప్పింగ్‌ను ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్ (హెచ్ఐఐటీ)’ కేటగిరీలో చేర్చారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలిచ్చే వ్యాయామాలను ఈ కేటగిరీలో చేరుస్తారనే విషయం తెల్సిందే. అన్నింటికన్నా గొప్ప విషయం స్కిప్పింగ్ చేయడాన్ని ఓ సరదాగా అలవాటు చేసుకోవచ్చు. ఇందులో రక రకాల విద్యలను ప్రదర్శించడం ద్వారా ఇతరులను ఆకర్షించవచ్చు. వారికో సవాల్ విసరునూవచ్చు. -
స్కిప్పింగ్‌తో ఔరా అనిపించిన నితిన్
ఇటీవలే ఓ ఇండివాడైన యంగ్ హీరో నితిన్ మళ్లీ సినిమా షూటింగులకు సమాయాత్తం అవుతున్నాడు. దానిలో భాగంగా ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. తన ఫిట్నెస్ ట్రైనర్ వంశీ సమక్షంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను అతను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కేవలం మూడున్నర నిమిషాల్లో 500 జంప్ రోప్స్ చేసి నితిన్ ఔరా అనిపించాడు. స్కిప్పింగ్ వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుందని నితిన్ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వ్యాయామం, పౌష్టికాహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం రంగ్ దే. కీర్తిసురేశ్ హీరోయిన్. దీంతోపాటు మేర్లపాక గాంధీ దర్శకత్వం ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘రంగ్ దే’ హీరో వర్కవుట్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (చదవండి: బాలీవుడ్ భీష్మ) View this post on Instagram 500 jumpropes at a strech in 3.25 min Back to grind 💪 with @vamshicoach_boxfitt11 Getting better at lung capacity and immunity with proper fitness and nutrition #boxfitt11 #jumprope A post shared by N I T H I I N (@actor_nithiin) on Aug 25, 2020 at 5:56am PDT -
ఏదో తెలియని అభద్రత...
సందేహం నేను కాస్త లావుగా ఉండేదాన్ని. బరువు తగ్గాలని ప్రతిరోజూ స్కిప్పింగ్ చేసేదాన్ని. దాని వల్ల నా బ్రెస్ట్ లూజ్ అయింది. దాంతో నాకు ఏదో తెలియని అభద్రతా భావం కలుగుతోంది. మరో ఆరు నెలల్లో నాకు పెళ్లి జరగబోతోంది. దీనివల్ల నా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. నా బ్రెస్ట్‌ని మళ్లీ టైట్‌గా చేసుకోవడానికి ఏమైనా సలహా ఇవ్వండి. - జాహ్నవి స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవ్వదు. స్కిప్పింగ్ వల్ల మీరు బరువు తగ్గి, బ్రెస్ట్‌లో ఉండే కొవ్వు, దాని చుట్టూ ఉండే కొవ్వు కరగడం వల్ల లూజయి ఉండొచ్చు. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. రొమ్ములు బిగుతుగా అవ్వడానికి రెగ్యులర్‌గా వలయాకారంలో బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి. దాంతో రక్తప్రసరణ పెరిగి, రొమ్ముల పటుత్వం పెరిగి, టైట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఛాతీ వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలా చేసినా... ఉపయోగం లేకుండా మరీ ఇబ్బందిగా ఉంటే ఓసారి ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి వారి సలహా పాటించవచ్చు. నా వయసు 21. ఎనిమిది నెలల క్రితమే నాకు పెళ్లైంది. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరం బాగా సెటిల్ అయ్యాం. కాకపోతే వేరువేరు చోట్ల ఉద్యోగం చేస్తుండటం వల్ల శారీరకంగా నెలకు రెండుమూడుసార్లు మాత్రమే కలుస్తుంటాం, అలా కలిసినప్పుడు ఓసారి గర్భం రాకుండా ఉండేందుకు ఒక పిల్‌ను వేసుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. పీరియడ్ కూడా రెగ్యులర్‌గా వచ్చింది. కానీ అప్పటి నుంచి దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతోంది. అలాగే అది వేసుకున్న తర్వాత శారీరకంగా కలిసినప్పుడు నొప్పిగా అనిపించింది. ఈ పిల్ వేసుకోవడం వల్ల నాకు భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు వస్తాయా? పిల్లలు కలగడానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? - స్నేహ మీరు వేసుకున్న పిల్ ఎప్పుడో ఒకసారి జాగ్రత్తలు తీసుకోకుండా కలిసినప్పుడు, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు తయారు చేయబడింది. కానీ అది 100 శాతం గర్భం రాకుండా అవుతుందని చెప్పలేం. అది వాడినా 10-15శాతం మందిలో గర్భం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పిల్ వాడటం వల్ల వైట్ డిశ్చార్జ్, దురద, దుర్వాసన, నొప్పి వంటివి ఏమీ ఉండవు. ఒకసారి వాడటం వల్ల పిల్లలు కలగడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. మీకు ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, పొత్తి కడుపులో నొప్పి వచ్చి ఉండవచ్చు. ఇంకా అలాగే ఉంటే ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిల్ మాటిమాటికీ వేసుకోవడం మంచిది కాదు. దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, హార్మోన్లలో మార్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి? - పేరు రాయలేదు కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండడం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడడం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్