
ఇటీవలే ఓ ఇండివాడైన యంగ్ హీరో నితిన్ మళ్లీ సినిమా షూటింగులకు సమాయాత్తం అవుతున్నాడు. దానిలో భాగంగా ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. తన ఫిట్‌నెస్ ట్రైనర్ వంశీ సమక్షంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను అతను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కేవలం మూడున్నర నిమిషాల్లో 500 జంప్ రోప్స్ చేసి నితిన్ ఔరా అనిపించాడు. స్కిప్పింగ్ వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుందని నితిన్ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వ్యాయామం, పౌష్టికాహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం రంగ్ దే. కీర్తిసురేశ్ హీరోయిన్. దీంతోపాటు మేర్లపాక గాంధీ దర్శకత్వం ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘రంగ్ దే’ హీరో వర్కవుట్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
(చదవండి: బాలీవుడ్ భీష్మ)
Comments
Please login to add a commentAdd a comment