skipping rope
-
వైరల్ వీడియో : మనిషినే తాడుగా తిప్పుతూ...!
-
మనిషినే తాడుగా తిప్పుతూ.. నిమిషంలో 57 సార్లు స్కిప్పింగ్ చేసి రికార్డ్
శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్‌నెస్‌కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. రోజువారీగా స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అంతేగాక దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డునే సృష్టించారు . దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డ్స్ వాళ్లు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో పోటీపడే వాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడ్డారు. అయితే సాధారణ తాడుతో ఆడి కాకుండా వినూత్నంగా రికార్డ్ క్రియేట్ చేశారు. తాడుకు బదులు మనిషిని ఉపయోగిస్తూ స్కిప్పింగ్ చేశారు. మనిషిని పైకి కిందకు తిప్పుతూ కేవలం నిమిషంలో ఏ జట్టు ఎక్కవసార్లు స్కిప్‌లు చేస్తే వారు విజేతలుగా నిలిచినట్లు అవుతుంది. ఇందులో యూకేకు చెందిన అక్రోపోలిస్(బ్లూ డ్రెస్) అనే జట్టు, వైల్డ్ క్యాట్స్ చీర్ టీమ్‌తో తలపడింది. అయితే నిమిషంలో 57 సార్లు స్కిప్‌లు పూర్తి చేసి యూకే టీం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘వావ్.. అద్భుతం’ అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు.. ‘ఇది పూర్తయిన తరువాత ఆ అబ్బాయి పాపం వాంతి చేసుకుని ఉంటాడు. బాలుడి తల నేలకు తాకితే ఎంత ప్రమాదం.. దయచేసి ఇలాంటివి అనుకరించవద్దు’ అని సూచిస్తున్నారు. The cheapest skipping rope is a human one... Which team can get in the most skips in one minute? pic.twitter.com/6GJWsj9nAN — Guinness World Records (@GWR) October 21, 2022 -
120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి..
సాధారణ బరువున్న వాళ్లు వంద స్కిప్‌లు చేస్తే గుండె దడవచ్చి, అలసిపోతారు. అలాంటిది 120 కేజీల బరువున్న బాలికతో ఆమె తల్లి ఒకరోజు కాదు రెండురోజులు కూడా కాదు ఏకంగా మూడు నెల్లపాటు మూడు వేల స్కిప్‌లు చేయించిందట. దీంతో బాలిక తవ్ర అస్వస్థతకు గురైంది. ఇదంతా ఎందుకు చేసిందంటే.. చైనా మీడియా కథనాల ప్రకారం చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురు ఎత్తు పెరగాలనే ఉద్ధేశ్యంతో చేసిన పని బాలిక ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది. యువాన్యువాన్ అనే బాలిక ఎత్తు 1.58 మీటర్లు. బరువు 120 కేజీలు. ఎక్సర్సైజుల ద్వారా ఆమె బరువును తగ్గించి ఎత్తు పెంచాలని తల్లి నిర్ణయించుకుంది. ఐతే దీని గురించి తల్లి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. అందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ప్రారంభంలో రోజుకు వెయ్యి స్కిప్స్ చేయించేది. పోనుపోనూ 3 వేల స్కిప్స్ రోజూ చేయమని పోరు పెట్టేదట. ఇలా మూడు నెలలపాటు చేసింది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. దీంతో బాలిక తరచూ మోకాళ్ల నొప్పి వస్తుందని తల్లికి ఫిర్యాదు చేసేది. ఐతే కూతురు బద్దకంతో ఇలా చెబుతుందని అనుకుందట. బాలికకు మొకాళ్ల నొప్పి తీవ్రతరం కావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ ‘ట్రాక్షన్ అపొఫిసైటిస్’ అనే కీళ్ల సమస్యకు గురైనట్లు తెలిపాడు. అంతేకాకుండా అధిక వ్యాయామం పిల్లలకు హానికరమని, బరువుతగ్గడానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని, ఇంతకు ముందు కూడా అధిక వ్యాయామం కారంణంగా పదేళ్ల బాలుడు కాలిచీలమండ నొప్పికి గురైనట్లు వెల్లడించాడు. పిల్లలకు వ్యాయామంతోపాటు సరైన నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి వంటి వాటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సదరు మహిళకు సూచించాడు. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! -
జాతీయస్థాయి రోప్ స్కిప్పింగ్ లో మూడో స్థానం
తుని రూరల్ : జాతీయ స్థాయిలో భోపాల్‌లో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో తుని మండలం వి.కొత్తూరు సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు తృతీయ స్థానం కైవశం చేసుకున్నారని పీఈటీ సాధన సోమవారం తెలిపారు. అండర్–14లో ఎం.ప్రిన్సీ, జి.దేవి, టి.స్వర్ణలత, ఎస్.చాందిని తృతీయ స్థానం సాధించారని చెప్పారు. అండర్–16 వ్యక్తిగత విభాగంలో వి.న్యూరోజీ తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది అండర్–14 విభాగంలో వీరికి స్వర్ణపతకం లభించిందన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ రమా మహేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు. -
వాహ్.. విన్యాసం
విశాఖపట్నం: మల్లకంబ విన్యాసాలు, రోప్ స్కిప్పింగ్ చాతుర్యాలకు విశాఖ తొలిసారిగా వేదికైంది. సాగరతీరంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని నగరవాసులు ఆస్వాదించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల మల్లకంబ పోటీల్లో ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ప్రతిభ పాటవాలు ప్రదర్శించనుండగా రాష్ట్రస్థాయి రోప్స్కిప్పింగ్లో పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు ప్రారంభించారు. విశాఖ సాగరతీరంలోని సీఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఇసుక తిన్నెలపై జరుగుతున్న ఈ పోటీల్లో మల్లకంబ విన్యాసాలను క్రీడాకారులు ప్రదర్శించారు. రోప్ స్కిప్పింగ్‌పై అవగాహన ప్రదర్శన జరిగింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా, మహారాష్ట్రలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లకంబ క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శుక్రవారం పోల్పైనా, వేలాడుతున్న తాడుతోనూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు రోప్‌తో స్కిప్పింగ్ చేస్తూ ఇచ్చిన ప్రదర్శన అబ్బురపరిచింది. పోటీలు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ప్రారంభ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ది ఒలింపిక్ సంఘం, విశాఖ అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, కార్యదర్శి ఎం.శాంబాబు, రోప్ స్కిప్పింగ్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.