జాతీయస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ లో మూడో స్థానం | skipping rope national 3rd prize | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ లో మూడో స్థానం

Published Mon, Nov 14 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

skipping rope national 3rd prize

తుని రూరల్‌ : 
జాతీయ స్థాయిలో భోపాల్లో నిర్వహించిన రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో తుని మండలం వి.కొత్తూరు సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు తృతీయ స్థానం
కైవశం చేసుకున్నారని పీఈటీ సాధన సోమవారం తెలిపారు. అండర్‌–14లో ఎం.ప్రిన్సీ, జి.దేవి, టి.స్వర్ణలత, ఎస్‌.చాందిని తృతీయ స్థానం సాధించారని చెప్పారు. అండర్‌–16 వ్యక్తిగత విభాగంలో వి.న్యూరోజీ తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది అండర్‌–14 విభాగంలో వీరికి స్వర్ణపతకం లభించిందన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ రమా మహేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement