slaps party worker
-
కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ
సాక్షి, తాడిపత్రి (అనంతపురం): అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులతో కలిసి మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరగా.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారానికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు. అయినా వినకుండా ప్రచారం చేపట్టడంతో మార్గమధ్యంలో డీఎస్పీ వీఎన్కే చైతన్య మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అరెస్ట్ చేస్తారా.. చేయండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నడుచుకుంటూ కాకుండా ప్రచార వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. ఇంతలో టీడీపీ కార్యకర్త రఘునాథ్‌రెడ్డి కల్పించుకుని పోలీసులు చెప్పినట్టు చేద్దాం అనడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి బండబూతులు తిడుతూ ఆయనపై పలుమార్లు చేయి చేసుకున్నారు. -
పార్టీ కార్యకర్తను కొట్టిన యూపీ మంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అంటేనే రౌడీలు, గూండాలకు ప్రసిద్ధి అంటారు. ఓ మంత్రిగారు ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కార్యకర్త ఒకరిని చెంపమీద కొట్టి, పిడిగుద్దులు కురిపించారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగిపోతోందని చెప్పడమే అతడు చేసుకున్న పాపం. రాష్ట్ర పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సురేంద్ర పటేల్ అందరూ చూస్తుండగా వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా ఇలా కార్యకర్తను కొట్టారు. పార్టీ మద్దతుదారులు తమ సమస్యలు చెప్పుకొంటుండగా, కొంతమంది పార్టీ సభ్యులే గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆ కార్యకర్త చెప్పారు. వెంటనే మంత్రిగారు అతగాడివైపు దూకి, చెంపమీద కొట్టారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు కురిపించారు. మరోమంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అనుచరుడైన పటేల్.. కార్యకర్తను తీవ్రంగా హెచ్చరించడంతో అతడు రెండుచేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ఇదంతా టీవీ కెమెరాలకు ఎంచక్కా చిక్కింది. సొంత పార్టీ కార్యకర్తలనే మంత్రులు ఇలా కొడుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు.