Sleeper Class Coach
-
Vande Bharat: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. 👉స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. 👉 ఇంటీరియర్‌ను జీఎప్ఆర్పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. 👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. 👉 ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. 👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 👉 కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. 👉 అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. 👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. 👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
వావ్..!అనిపించే వందేభారత్ స్లీపర్ కోచ్ (ఫొటోలు)
-
ఇది విన్నారా..! వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు వస్తున్నాయ్
భారతదేశంలో ఇప్పుడు వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్ మొదలైంది. అయితే రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసులు త్వరలోనే దేశం మొత్తం మీద అందుబాటులో రానున్నాయి. నివేదికల ప్రకారం, భెల్ (BHEL) నేతృత్వంలో ఉన్న కన్సార్టియం మరో ఆరు సంవత్సరాల్లో 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్ల వినియోగం కూడా చాలా అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి హౌరా వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ట్రైన్లు ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ క్లాస్‌లను మాత్రమే కలిగి ఉంటాయి. అయితే స్లీపర్ క్లాసులు ఇప్పటికి అందుబాటులో లేదు. (ఇదీ చదవండి: AIMA Awards 2023: ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే భెల్ ఒక్క ట్రైన్ కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కన్సార్టియం ICF చెన్నైలోని తయారీ యూనిట్‌తో పాటు భారతీయ రైల్వేలు కేటాయించిన రెండు డిపోలలో అందించిన ప్రత్యేక స్థలాన్ని కూడా సన్నద్ధం చేస్తుంది. మొత్తానికి స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయని స్పష్టమవుతోంది. -
‘హమ్‌సఫర్’ ఫ్లెక్సీ ఫేర్ తొలగింపు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త .ప్రీమియం రైళ్లు అయిన హమ్‌సఫర్ రైళ్లకు ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని తొలగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంతేగాక వాటిలో స్లీపర్ క్లాస్ కోచ్‌లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేకి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. శుక్రవారం ఆనంద్ విహార్ నుంచి అలహాబాద్ వెళ్లే హమ్‌సఫర్ రైల్లో నాలుగు స్లీపర్ బోగీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం 35 హమ్‌సఫర్ రైళ్లకు వర్తిస్తుందని, ప్రస్తుతం వాటిలో 3–టైర్ ఏసీ వరకు మాత్రమే బోగీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా జోన్ల అవసరాలను బట్టి స్లీపర్ బోగీలను ప్రవేశపెడుతామని ఆ అధికారి తెలిపారు. వీటితోపాటు హమ్‌సఫర్ రైళ్ల తత్కాల్ బుకింగ్ ధరలను కూడా తగ్గించారు. ఇన్నాళ్లు ఈ రైళ్లలో తత్కాల్ బుకింగ్‌లకు సాధారణ టికెట్ ధరపై 1.5 శాతం అధికంగా వసూలు చేయగా ఇకపై 1.3 శాతం వసూలు చేస్తారు. దీంతో మిగతా రైళ్లలోని తత్కాల్ ధరలతో హమ్‌సఫర్ రైళ్ల తత్కాల్ ధరలు సమానమవుతాయి. కాగా గత కొన్ని వారాలుగా ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీట్లున్న రైళ్లలో టికెట్ ధరలపై రైల్వేశాఖ 25 శాతం తక్కువ ధర వసూలు చేస్తుండటం తెలిసిందే. అంతేగాక సరుకు రవాణా ధరల్లో కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. -
బోగీలు భగభగ
సాక్షి, సిటీబ్యూరో: వేసవి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.జనరల్, స్లీపర్ బోగీలు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. వడగాలులు, ఉక్కుపోతలతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బోగీలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రయాణికులు ఏసీ బోగీలపై ఆసక్తి చూపుతున్నారు. స్లీపర్ బోగీల్లో కంటే థర్డ్ ఏసీ బోగీల్లోనే వెయింటింగ్ లిస్టు వందల్లో నమోదవుతోంది. అయితే ప్రయాణికుల డిమాండ్ మేరకు అధికారులు అదనంగా ఏసీ బోగీలను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. కొన్ని రైళ్లకు మాత్రం అరకొరగా అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఏసీ బోగీలు అందుబాటులో లేకపోవడంతో స్లీపర్ బోగీల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ బోగీల్లో బయటి ఉష్ణోగ్రతల కంటే ఒకటి,. రెండు డిగ్రీలు ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, పట్నా, కోల్‌కత, విశాఖ, భువనేశ్వర్, ముంబయి, చెన్నై, తదితర దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు స్లీపర్ బోగీల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వయోధికుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపతోంది. ఒకవైపు బోగీల్లో వేడి, మరోవైపు బయటి నుంచి వచ్చే వడగాలుల కారణంగా అవస్థలు పడుతున్నారు.‘ ఏసీ బోగీల్లో రిజర్వేషన్లు దొరకడం లేదు. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిపోయింది. దీంతో స్లీపర్ బోగీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ బోగీల్లో పైన ఫ్యాన్లు తిరిగినా అర్ధరాత్రి వరకు వేడిగాలులే వీస్తున్నాయి. రైలెక్కాలంటేనే భయమేస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏసీలు అరకొర... హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి మూడు వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ మధ్య నడిచే గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు 14 ఉండగా థర్డ్ ఏసీ బోగీలు 3 మాత్రమే ఉంటాయి. సెకెండ్ ఏసీ 2 బోగీలు మాత్రమే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది స్లీపర్ పైనే ఆధారపడుతారు. ప్రయాణ చార్జీల విషయంలో థర్డ్ ఏసీ, స్లీపర్ మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. అన్ని వేళల్లో కాకపోయినా వేసవి కాలంలోనైనా స్లీపర్ బోగీలను కొన్నింటిని తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు ఇటీవల కాలంలో చాలామంది ప్రయాణికులు స్లీపర్ కంటే ఏసీ బోగీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 24 గంటలకు పైగా స్లీపర్, జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే దూరప్రాంత రైళ్లలో వేడిగాలుల కారణంగా ప్రయాణికులు తరచూ వడదెబ్బకు గురవుతూ డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బోగీ సదుపాయాల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ అన్నింటిలోనూ ఏసీ బోగీలు పరిమితంగానే ఉన్నాయి. ఐదింటికే పరిమితం... వేసవి ఉష్ణోగ్రతలు, ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రైళ్లలో మాత్రమే థర్డ్ ఏసీ బోగీలను ఏర్పాటు చేశారు. తిరుపతి–లింగంపల్లి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి,.లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రం థర్డ్ ఏసీ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ సికింద్రాబాద్ నుంచి పట్నాకు రాకపోకలు సాగించే పట్నా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ధానాపూర్, గోదావరి తదితర రైళ్లకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఏసీ బోగీలను పెంచకపోవడం గమనార్హం. -
రైళ్లలో అదనపు బెర్త్‌లు
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె ప్రభావం రాకపోకలపై చూపనుంది. రాజధాని హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు రాకపోకలు సాగించే 1500కు పైగా బస్సులు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 13 నుంచి 20 వరకు 16 రైళ్లలో అదనపు బెర్త్ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా అదనపు ప్రయాణ సదుపాయం ఏర్పడుతుందని సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే పద్మావతి (12764/12763) ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 15,16,17,18,19 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఈనెల 13,16,17,18,19,20 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్ బోగీ అదనంగా అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12731/12732) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 13,14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,15 తేదీల్లో అదనపు స్లీపర్‌కోచ్‌లు ఉంటాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 12,19, 13,120 తేదీల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు. తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి మచిలీపట్నంకు ఈనెల 19న, తిరుగు ప్రయాణంలో 13,20 తేదీల్లో అదనపు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ (17256/17255) ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 13,19 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,20 తేదీల్లో అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ (17429/17430) రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 19న, తిరుగు ప్రయాణంలో ఈ నెల 13,20 తేదీల్లో అదనపు బోగీలు ఉంటాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12770/12769) సెవెన్‌హిల్స్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు 13,17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ నెల 16,18 తేదీల్లో అదనపు బెర్తులు ఉంటాయి. తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి కరీంనగర్‌కు ఈ నెల 16,18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 15వ తేదీన ఒక స్లీపర్ క్లాస్ చొప్పున అందుబాటులోకి రానున్నాయి. రాకపోకలెలా? ఎన్జీఓల సమ్మె ప్రకటనతో చాలామంది ముందస్తుగా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మంగళవారం నుంచి బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వేల మంది ఇబ్బందులకు గురికానున్నారు. రోజూ 3500 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తాయి. లక్ష మందికి పైగా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అయితే, కొద్ది రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్‌లు, ఆందోళనల నేపథ్యంలో రాజధాని నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.