Sleeve blouse
-
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
స్లీవ్ లెస్స
స్లీవ్‌లెస్ జాకెట్స్ తెలుసు కదూ! ఇప్పుడు కాంట్రాస్ట్ స్లీవ్లతో స్లీవ్‌లెస్ కంటే కూడా సూపర్‌గా ఉండే స్లీవ్ లెస్స అనిపించే డిజైన్లు ఇవి... మల్టీకలర్ స్లీవ్స్ చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటే పెద్ద డిజైన్ అక్కర్లేదని ముందే అనుకున్నాం కదా! అలాగే పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్స్ (ప్లెయిన్ పట్టు, రాసిల్క్, బెనారస్, నెటెడ్... వంటి క్లాత్ అయితే బాగుంటుంది) ఎంపిక చేసుకొని బ్లౌజ్ బాడీ పార్ట్‌కి ఒకే కలర్ ఫ్యాబ్రిక్ వేయాలి. చేతుల భాగానికి రెండు మూడురకాల ఫ్యాబ్రిక్‌తో కుట్టి, దాని మీద అందంగా ఎంబ్రాయిడరీ చేస్తే కొత్త లుక్ వచ్చేస్తుంది. బెనారస్‌తో బుట్టచేతులు బాడీ పార్ట్ చీర రంగు ప్లెయిన్ క్లాత్‌తో డిజైన్ చేయాలి. స్లీవ్స్ పార్ట్ చీరకు, బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే బెనారస్ క్లాత్‌తో బుట్టచేతులతో డిజైన్ చేయించుకోవాలి. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఆలోవర్ బుటా ఉండటం వల్ల ఇదే డిజైన్‌గా కనిపిస్తుంది. అందుకని స్లీవ్స్ పార్ట్‌కి వేరే మగ్గం వర్క్ వంటి ఎంబ్రాయిడరీ అవసరం లేకుండా చేతుల భాగాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. బుట్ట చేతులు లేదంటే మోచేతుల వరకు చేతుల భాగాన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెటెడ్తో నయనానందం పట్టు చీరల మీదకు నెటెడ్ బ్లౌజ్లా అని ఆలోచించేవారుంటారు. ఇలాంటి వారు బ్లౌజ్ బాడీ పార్ట్‌ని పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకొని, చేతుల భాగానికి కాంట్రాస్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. నెట్ మరీ సాదా సీదాగా ఉంటుంది కాబట్టి దీని మీద గ్రాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే లుక్ వావ్ అనిపిస్తుంది. అక్కర్లేని పెద్ద పెద్ద డిజైన్లు చీరకు బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో జాకెట్టు చేతుల భాగం ఉండటంతో త్వరగా చూపులను దోచేస్తుంది. అలాంటప్పుడు గాడీగా డిజైన్లు అక్కర్లేదని అతివల భావన. అందుకని ఈ స్లీవ్స్ భాగాన్ని సింపుల్ డిజైన్‌తో సరిపెట్టేయవచ్చు. పట్టుచీరలకూ కాంట్రాస్ట్ పట్టు చీర అంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాల్సిందే అనే ట్రెండ్ నిన్నా మొన్నటిది. ఇప్పుడు పట్టులోనూ కాంట్రాస్ట్ స్లీవ్స్ ప్యాటర్న్ బాగా ఆకట్టుకుంటుంది. బ్లౌజ్ భాగాన్ని చీర బాడీ ప్యాటర్న్‌ని, చేతుల భాగాన్ని చీర అంచు భాగంతో డిజైన్ చేస్తే ఓ సరికొత్త లుక్ వచ్చేస్తుంది. బాడీ పార్ట్ కాంట్రాస్ట్ చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని బ్లౌజ్ బాడీ పార్ట్‌ని డిజైన్ చేయించుకోవాలి. చేతుల భాగానికి చీరలో ఇచ్చే బ్లౌజ్ ఫాబ్రిక్‌తో డిజైన్ చేయించాలి. దీంతో ఒక ప్రత్యేక లుక్‌తో పార్టీలో మెరిసిపోతారు. ∙ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ బ్లౌజ్‌లతో పోల్చితే ఈ కాంట్రాస్ట్ స్లీవ్స్ బ్లౌజ్‌ల డిజైన్‌కి ఖర్చు తక్కువే అవుతుంది. ∙దీనికి ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు చీరకు పూర్తి కాంట్రాస్ట్ క్లాత్‌ల ఎంపిక సులువు కూడా! ∙చేతుల పార్ట్‌కి విడిగా ఎంబ్రాయిడరీ చేయించిన పార్ట్‌ని ప్యాచ్‌లా తర్వాత జత చేసుకోవచ్చు. - నిర్వహణ ఎన్.ఆర్ -
శ్రావణం రాణుల ఓణీలు
శ్రావణం వచ్చింది. పండగ వాతావరణానికి సంతకం పెట్టింది. వ్రతాలకు తోరణం అయింది. అమ్మాయిల అలంకరణ గృహాలన్నీ ఇప్పుడు రాణిగారి మందిరాలే! హరివిల్లులు సైతం వెలవెల పోయేలా ఈ యవరాణులు వర్ణాలను వస్త్రాలుగా ధరిస్తున్నారు. శ్రావణం వచ్చింది. లంగా ఓణీ ధరించింది. శుభం. లక్ష్మీ కటాక్షం! ⇒ సాదా సీదాగా కనిపించే కుచ్చుల లెహంగాకు మరో ప్రింటెడ్ క్లాత్‌ని కుడివైపున లేయర్‌గా జత చేస్తే ఈ తరం డిజైనర్ పరికిణీ అవుతుంది. దీనికి ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, ప్లెయిన్ ఓణీ ధరిస్తే అమ్మడి సింగారానికి కొత్త భాష్యాలు రాసుకోవచ్చు. ⇒ లంగా, ఓణీ, బ్లౌజ్ ఒకే రంగులో ఎంపిక చేసుకుంటే ఈ తరం అమ్మాయిల ఎంపికకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డట్టే! స్వరోస్కి వర్క్ చేసిన రాయల్ బ్లూ కలర్ లెహంగా, అదే హంగులతో అమరిన స్లీవ్‌లెస్ బ్లౌజ్, చిన్న చిన్న బుటీలతో ఓణీ సింగారం అబ్బుర పరుస్తుంది. ⇒ పండగ అంటేనే పసుపు–ఎరుపుల కాంబినేషన్. ఆ రంగుల హ్యాండ్లూమ్ క్లాత్‌ని ఎంపిక చేసుకొని లంగాఓణీగా డిజైన్ చేసుకుంటే పండగ వేళ ఇలా కళగా ముస్తాబు కావచ్చు. నట్టింటికి పండగ శోభను ఇట్టే మోసుకురావచ్చు. ⇒ పసుపు రంగు నెటెడ్ లెహంగా, దానికి అంచుగా డిజైనర్ ప్యాచ్ జత చేస్తే పండగ శోభ వచ్చితీరాల్సిందే! అంచు రంగులో ఎంపిక చేసుకున్న స్లీవ్‌లెస్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ఓణీ ధరిస్తే ఆధునికతకు సంప్రదాయపు హంగులు అద్దినట్టే! ⇒ తెల్లటి పరికిణీకి ఎంబ్రాయిడరీ చేసిన పర్పుల్ కలర్ అంచును ప్యాచ్‌గా వేసి, అదే రంగు ప్లెయిన్ బ్లౌజ్ ధరించి, వైబ్రెంట్‌గా వెలిగే ఓణీని జత చే ర్చితే... ఇదిగో ఇలా తెలుగింటి పండగకు నట్టింట విరుస్తాయి సంబరాల వెలుగులు. ⇒ గులాబీ రంగు బెనారస్ పట్టు లెహంగాకు అంచుగా ప్లెయిన్ క్లాత్, దానికి కిందగా మరో లేయర్.. డిజైనర్ లెహంగాలో కొత్తగా మెరిసిపోతుంది ఈ తరహా డ్రెస్సింగ్. బంగారురంగును పోలి ఉండే లాంగ్ జాకెట్, ప్లెయిన్ ఓణీ వేడుకును మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది. ⇒ చేతిపనితనంతో లతలలో ఒదిగిన పువ్వుల హంగులు నీలిరంగు పరికిణీపై నిలువుగా పరుచుకున్నాయి. అంచు లుగా తీరుగా ముస్తాబు అయ్యాయి. ఏ మాత్రం మ్యాచ్ కాని కాంట్రాస్ట్ బ్లౌజ్, క్రీమ్ కలర్ ఓణీ పండగకు సంప్రదాయపు కళ అద్దుతుంది.