slitting throat
-
గొంతు కోసి.. రైలు పట్టాలపై పడేసి
న్యూఢిల్లీ : కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కోపంతో యువకుడి గొంతు కోసి రైలు పట్టాలపై పడేసిందో మహిళ. ఈ సంఘటన ఢిల్లీకి సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన బీనా(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుంటుంది. బహద్దూర్, అమిత్ అనే మరో ఇద్దరు బీనా సహాయకులుగా పనిచేస్తున్నారు. అలిఘర్‌కు చెందిన భగవాన్ సింగ్ కొద్ది రోజులుగా కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో బీనా.. కొడుకు తరుణ్, పనివాళ్ల సహాయంతో అతడి గొంతు కోసి సుఖినగర్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. రైలు పట్టాలపై రక్తపు మడుగులో ఉన్న భగవాన్ను గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సల అనంతరం కోలుకున్న భగవాన్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ప్రధాన నిందితురాలు బీనా కొడుకు తరుణ్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలి గొంతుకోసి.. ఆస్పత్రి పైనుంచి దూకి..
రాంచి: పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ప్రియురాలి గొంతుకోసి, ఆత్మహత్య చేసుకున్నాడో ప్రియుడు. రాంచిలోని పుందాంగ్ ప్రాంతంలో ఆ ఘటన చోటుచేసుకుంది. మాట్లాడదామని రమ్మని ప్రియురాలిని పిలిచి అఘాయిత్యానికి తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్మ చేసుకోగా.. ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అమిత్ శ్రీవాస్తవ్ (29) స్థానిక యువతి, తన స్నేహితురాలిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె దగ్గర చాలాసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ, పెళ్లికి ఆ యువతి నిరాకరించింది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. మళ్లీ ఇద్దరి మధ్యా ఇదే విషయంలో వాగ్వాదం జరిగింది. ఆమె పెళ్లికి ససేమిరా అంది. దీంతో ఆగ్రహానికి గురైన అమిత్.. వెంటతెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. రక్త స్రావమవుతుండడంతో భయపడిన అమిత్ ప్రియురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అదే ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.