ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కోపంతో యువకుడి గొంతు కోసి రైలు పట్టాలపై పడేసిందో మహిళ. ఈ సంఘటన ఢిల్లీకి సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన బీనా(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుంటుంది. బహద్దూర్, అమిత్ అనే మరో ఇద్దరు బీనా సహాయకులుగా పనిచేస్తున్నారు. అలిఘర్‌కు చెందిన భగవాన్ సింగ్ కొద్ది రోజులుగా కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో బీనా.. కొడుకు తరుణ్, పనివాళ్ల సహాయంతో అతడి గొంతు కోసి సుఖినగర్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు.
రైలు పట్టాలపై రక్తపు మడుగులో ఉన్న భగవాన్‌ను గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సల అనంతరం కోలుకున్న భగవాన్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ప్రధాన నిందితురాలు బీనా కొడుకు తరుణ్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment