smart homes
-
ఈ స్మార్ట్ హోమ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అందుకే, ప్రపంచంలోకి కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతం అవుతాయి. గృహ రంగానికి సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. భవిష్యత్ మొత్తం టెక్నాలజీ అని చెప్పుకోవడానికి ఇదో ఓ ఉదాహరణ. ఇప్పటి వరకు ఇల్లు అనేది నిశ్చలంగా ఉండేది. ఇక నుంచి మన ఇల్లును మనకు నచ్చిన చోటుకు తీసుకొని వెళ్లవచ్చు. నెస్ట్రన్ కంపెనీ తర్వాతి తరం ఇళ్లను నిర్మిస్తుంది. ఇది చూడాటానికి అన్నీ సౌకర్యాలతో గల ఒక "స్మార్ట్ హోమ్" లాగా అనిపిస్తుంది. నెస్ట్రాన్ క్యూబ్ సిరీస్ లో మొదటిసారి జనవరి 2020లో సింగిల్ రూమ్ గల ఒక స్మార్ట్ హోమ్ నిర్మించింది. కానీ, ఇది చిన్నగా ఉండటంతో అనుకున్నంత ప్రజాదరణ రాలేదు. అందుకే ముగ్గురు లేదా నలుగురు నివసించేందుకు వీలుగా క్యూబ్ టూ ఎక్స్(సీ2ఎక్స్) మరో స్మార్ట్ హోమ్ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఇది చాలా పాపులర్ అయ్యింది. దీనిలో ఫ్లోర్ టూ సీలింగ్ విండో, డబుల్ ఫ్రంట్ డోర్లు, పొడవైన, ల్యాండ్ స్కేప్ తరహా పిక్చర్ విండో ఉంది. నెస్ట్రాన్ సి2ఎక్స్ లో డిజిటల్ లాక్, ఎలక్ట్రిక్ బ్లైండ్, మోషన్ సెన్సింగ్ లైట్లు, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!) భూకంపాలు, హరికేన్లు తట్టుకునేలా నిర్మాణం దీనిలో ఇంకా స్మార్ట్ మిర్రర్లు, వాల్ మౌంటెడ్ టాబ్లెట్, స్మార్ట్ కిచెన్, స్మార్ట్ టాయిలెట్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్మార్ట్ ఫర్నిచర్, స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని అందించడానికి నెస్ట్రాన్ తన స్వంత "కాన్నీ" ఏఐ వ్యవస్థపై కూడా పనిచేస్తోంది. నెస్ట్రాన్ సీ2ఎక్స్ భూకంపాలు, హరికేన్లు, తుఫానులను దృష్టిలో పెట్టుకొని ఇన్సులేటెడ్, గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్డ్ నిర్మాణాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అలాగే, నెస్ట్రాన్ సోలార్/బ్యాటరీ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. క్యూబ్ టూ ఎక్స్ గత వారం ప్రీఆర్డర్ కోసం $98,000(సుమారు రూ.73 లక్షలు)తో ప్రారంభ ప్రమోషనల్ ధరతో ప్రారంభించింది. ఇంకా దీనిలో చాలా ఇతర ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ఈ స్మార్ట్ హోమ్ చూసేయండి.(చదవండి: ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు!) -
కస్టమర్ల చాయిస్ స్మార్ట్ హోమ్స్
సాక్షి, హైదరాబాద్: గృహ నిర్మాణ రంగంలో స్మార్ట్ హోమ్స్ డిమాండ్ శరవేగంగా పెరుగుతుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ స్మార్ట్ హోమ్స్ మార్కెట్ 893 మిలియన్ డాలర్లుగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని పూర్వాంకర ఎండీ ఆశీష్ పూర్వాంకర అంచనా వేశారు. గత దశాబ్ద కాలంగా డెవలపర్ల దృక్పథాన్ని మార్చిన పలు అంశాలను ఆయన చర్చించారు. అవేంటంటే.. దేశంలో ఈ–కామర్స్ కంపెనీల సక్సెస్‌తో రియల్టీ రంగంలోకి కూడా స్టార్టప్స్ ఎంట్రీ ఇచ్చాయి. దశాబ్ద కాలంగా ప్రాపర్టీ క్రయ విక్రయాలు, నిర్వహణ సేవలను అందించే కంపెనీలు జోరందుకున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ హోమ్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ ఇంటర్నెట్, రిమోట్ కంట్రోల్‌తో నడిచే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు సౌకర్యవంతంగాను, ఎంటర్టైన్మెంట్, భద్రత కలిగిస్తుంది. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఇంటిని, ఇంట్లోని ప్రతి వస్తువును ఆపరేట్ చేసే వీలుంటుంది. గత పదేళ్లలో రియల్టీ పరిశ్రమ డిజిటల్ వైపు మళ్లింది. నిర్మాణాల్లో డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), మిషన్ లెర్నింగ్ వంటి ఆటోమేటెడ్ టెక్నాలజీల వినియోగంపై దృష్టిసారించారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి పుణె, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు వంటి నాన్–మెట్రో నగరాల వైపు డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు. ►నిర్మాణ సామగ్రి, డిజైన్, టెక్నాలజీ అన్నింట్లోనూ డెవలపర్లు పర్యావరణహితమైనవి కోరుకుంటున్నారు. డిజైన్‌తో పాటూ నిర్మాణ సామగ్రి వినియోగంలోనే గ్రీన్ ఉత్పత్తులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో గత పదేళ్లలో నిర్మాణ రంగంలో గ్రీన్ టెక్నాలజీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. సీనియర్ సిటిజన్స్, సింగిల్ ఉమెన్, సింగిల్ ఓనర్స్ ఇలా సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వేర్వేరు నివాస ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆయా వయస్సు, లింగ భేదాలకు తగ్గట్లుగా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ►ఈ మధ్య కాలంలో అఫడబుల్ విభాగానికి విపరీతమైన డిమాండ్ వస్తుంది. దీంతో చిన్న, పెద్ద డెవలపర్లు అందరూ అఫడబుల్ ప్రాజెక్ట్‌ల మీద దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలు, వడ్డీ మినహాయింపుల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. -
'స్మార్ట్ హోమ్స్' కు స్మార్ట్ యాప్
కోల్ కత్తా : భారత్ ను స్మార్ట్ సిటీలుగా రూపకల్పన చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ స్మార్ట్ సిటీలతో రూపకల్పనతో పాటు మన ఇల్లుల్ని కూడా స్మార్ట్ గా ఉంచాలని ఆకాంక్షించారు ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ హోమ్స్ కోసం, స్మార్ట్ యాప్ కు శ్రీకారం చుట్టారు. మొబైల్ స్క్రీన్ పై ఒక్క టచ్ చేస్తే చాలు, ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేలా 'అలైవ్ హోమ్' యాప్ ను టెక్నాలజీ యూజర్ల ముందుకు తీసుకొచ్చారు. ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ఐదో ఏడాది ఉత్సాహవంతులైన టెక్నాలజీ విద్యార్థులు పూనమ్ గుప్తా, అలోక్ దీక్షిత్ లు ఈ అప్లికేషన్ ను రూపొందించారు. స్మార్ట్ హోమ్ లోపలున్న ప్రతి పనిని నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇంట్లో ఉన్న ప్రతీ ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ల మొబైల్ డివైజ్ ద్వారా వాటిని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. కానీ అది ఎంతో ఖరీదైనది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పరంగా ఎక్కువ మందికి యాక్సెస్ లో ఉంచేలా ఈ యాప్ ను రూపొందించామని ఈ యాప్ సృష్టికర్తలో ఒకరైన అలోక్ దీక్షిత్ చెప్పారు. ఈ హై ఎండ్ టెక్నాలజీని తక్కువ ధరకే యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఉండే స్విచ్ బోర్డులకు బదులు ఈ యాప్ ద్వారా స్మార్ట్ స్విచ్ లను వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ కు ఈ యాప్ రిమోట్ కంట్రోల్ ల ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏసీని కాని, గ్రీసర్ ను కాని ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్ కు వచ్చేస్తే ఈ యాప్ యూజర్లకు నోటిఫికేషన్ అలారమ్ ఇస్తుంది. ఈ అలారమ్ తో ఆఫీసు నుంచే వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించి లైట్లు వేస్తే ఈ యాప్ లోని స్మార్ట్ స్విచ్ ఆప్షన్ వల్ల వెంటనే యూజర్లకు తెలిసిపోతుంది. గతేడాది నుంచి ఈ యాప్ రూపొందించడానికి ఐఐటీ విద్యార్థులు అహర్నిశలు కృషిచేశారు. దీనిపై వారు పేటెంట్ ను కూడా దాఖలు చేసుకున్నారు. ఈ యాప్ ఇన్ స్టాలేషన్ ద్వారా ఖరగ్ పూర్ ఐఐటీని కూడా స్మార్ట్ క్యాంపస్ గా తీర్చిదిద్దారు.