ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అందుకే, ప్రపంచంలోకి కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతం అవుతాయి. గృహ రంగానికి సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. భవిష్యత్ మొత్తం టెక్నాలజీ అని చెప్పుకోవడానికి ఇదో ఓ ఉదాహరణ. ఇప్పటి వరకు ఇల్లు అనేది నిశ్చలంగా ఉండేది. ఇక నుంచి మన ఇల్లును మనకు నచ్చిన చోటుకు తీసుకొని వెళ్లవచ్చు. నెస్ట్రన్ కంపెనీ తర్వాతి తరం ఇళ్లను నిర్మిస్తుంది. ఇది చూడాటానికి అన్నీ సౌకర్యాలతో గల ఒక "స్మార్ట్ హోమ్" లాగా అనిపిస్తుంది.
నెస్ట్రాన్ క్యూబ్ సిరీస్ లో మొదటిసారి జనవరి 2020లో సింగిల్ రూమ్ గల ఒక స్మార్ట్ హోమ్ నిర్మించింది. కానీ, ఇది చిన్నగా ఉండటంతో అనుకున్నంత ప్రజాదరణ రాలేదు. అందుకే ముగ్గురు లేదా నలుగురు నివసించేందుకు వీలుగా క్యూబ్ టూ ఎక్స్(సీ2ఎక్స్) మరో స్మార్ట్ హోమ్ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఇది చాలా పాపులర్ అయ్యింది. దీనిలో ఫ్లోర్ టూ సీలింగ్ విండో, డబుల్ ఫ్రంట్ డోర్లు, పొడవైన, ల్యాండ్ స్కేప్ తరహా పిక్చర్ విండో ఉంది. నెస్ట్రాన్ సి2ఎక్స్ లో డిజిటల్ లాక్, ఎలక్ట్రిక్ బ్లైండ్, మోషన్ సెన్సింగ్ లైట్లు, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!)
భూకంపాలు, హరికేన్లు తట్టుకునేలా నిర్మాణం
దీనిలో ఇంకా స్మార్ట్ మిర్రర్లు, వాల్ మౌంటెడ్ టాబ్లెట్, స్మార్ట్ కిచెన్, స్మార్ట్ టాయిలెట్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్మార్ట్ ఫర్నిచర్, స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని అందించడానికి నెస్ట్రాన్ తన స్వంత "కాన్నీ" ఏఐ వ్యవస్థపై కూడా పనిచేస్తోంది. నెస్ట్రాన్ సీ2ఎక్స్ భూకంపాలు, హరికేన్లు, తుఫానులను దృష్టిలో పెట్టుకొని ఇన్సులేటెడ్, గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్డ్ నిర్మాణాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అలాగే, నెస్ట్రాన్ సోలార్/బ్యాటరీ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. క్యూబ్ టూ ఎక్స్ గత వారం ప్రీఆర్డర్ కోసం $98,000(సుమారు రూ.73 లక్షలు)తో ప్రారంభ ప్రమోషనల్ ధరతో ప్రారంభించింది. ఇంకా దీనిలో చాలా ఇతర ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ఈ స్మార్ట్ హోమ్ చూసేయండి.(చదవండి: ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు!)
Comments
Please login to add a commentAdd a comment