సిటీబస్సులో స్మార్ట్ పాసింజర్
మూగజీవులు ఏంచేసినా భలే వింతగా అనిపిస్తుంది. మాట్లాడినా, ఆటలాడినా వావ్ అనిపిస్తుంది. సెల్ఫీలకు పోజులు, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, వెరైటీ ఎక్సర్సైజ్లు చేస్తూ కొన్ని పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు... మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. సోషల్ మీడియా సాక్షిగా హగ్గులు, హాయ్‌లు చెప్పే జంతువులను కూడా చూసి ముచ్చటపడ్డాం. అయితే ఈ పిల్లి మరింత ప్రత్యేకం!! రద్దీ ప్రాంతమైన ఓ సిటీ బస్సులో ఒంటరిగా ప్రయాణం చేస్తూ.. తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తోంది. దాని తెలివితో ఇట్టే ఆకట్టుకుంటుంది.
టోక్యోలోని కిట్టీ అనే ఓ పిల్లి... సిబు ఇక్బుకురో లైన్ ప్రాంతంలో ఎక్కి తరచూ ప్రయాణం చేస్తోంది. ఇంచుమించు 2013 నుంచి ఈ పిల్లి... బస్సులో ప్రయాణిస్తూ.. తోటి ప్రయాణికులను నోటిమీద వేలు వేసుకునేలా చేస్తోంది. నిజానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గూగుల్ మ్యాప్‌లను ఫాలో అయ్యే మనుషుల మధ్య ఒక పిల్లి ఇలా ఎవరి సాయం లేకుండా ప్రయాణం చేస్తుంటే వింతే కదా మరి!!