smartphones prices
-
రూ.20 వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్ల విడుదల ఎక్కువైంది. కొనుగోలు దారులు సైతం ఆకట్టుకునే ఫోన్లు కళ్లెదురుగా కనిపిస్తుంటే ఏ ఫోన్ కొనుగోలు చేయాలో అర్ధం గాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే పనితీరు బాగుండి.. కెమెరా, బ్యాటరీ, స్మూత్ డిస్ప్లేతో రూ.20వేలకు మార్కెట్లో ఇప్పటికే కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. 5జీ పోకో ఎక్స్4 ప్రో రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఫోన్ల స్థానంలో పోకో ఎక్స్4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఫర్మామెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జర్, 64 ఎంపీ లెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభ్యం అవుతుంది 5జీ రెడ్మీ నోట్ 11ప్రో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 11ప్రో. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హేలియా జీ96 చిప్ సెట్‌తో రూ.20వేల లోపు బడ్జెట్ ధర ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుంటే ఈ ఫోన్లో బీజీఎంఐ,కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ) లాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్‌ను ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేట్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 5జీ ఐక్యూ జెడ్6 రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్6 బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ పండితులు చెబుతున్నారు. ఎందుంటే ఇందులో ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా పనితీరు బాగుండటమే కాదు.. స్నాప్ డ్రాగన్ 696 చిప్సెట్తో వస్తుంది. 50 ఎంపీ,2ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో డిజైన్ చేసింది ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 5జీ రియల్ మీ 9ప్రో రియల్ మీ 9ప్రోలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.6 అంగుళాల డిస్ప్లే,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ,33 డబ్ల్యూ ఛార్జర్, 64ఎంపీ నైట్ స్కేప్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్‌తో అందుబాటులో ఉంది. మోటోజీ52 మోటరోలా మోటో జీ 52 సూపర్ డిస్ల్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్ 2ఎంపీ సెన్సార్లతో ఈ ఫోన్ రూ.14,999కే లభ్యమవుతుంది. -
వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ మరో దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్‌తో ముందుకు రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ పేరుతో వరుస ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుండి 10 వరకు, రెండో సేల్ బిగ్ దీపావళి సేల్ పార్ట్ 1 అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించింది. తాజాగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు మరో బిగ్ దివాళీ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో కొనుగోలు దారులకు నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, డీల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై తగ్గింపు, ఎస్బీఐ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 80శాతం డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ పై 80శాతం ఆఫర్లో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో రెడ్మీ 9ప్రైమ్, ఎంఐ 11 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 వంటి స్మార్ట్ఫోన్లపై 80శాతం ఆఫర్‌ను అందిస్తుండగా..ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్ ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టైమ్ బాంబ్ డీల్స్ సాధారణ డిస్కౌంట్లు కాకుండా.. బిగ్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్లు 12ఏఎం, 8ఏఎం,4 పీఎం సమయాల్లో 'క్రేజీ డీల్స్'ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'టైమ్ బాంబ్ డీల్స్' లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 30 శాతం తగ్గింపుతో లభించనున్నాయి. పవర్ బ్యాంక్‌లు, హెడ్ఫోన్లు,స్పీకర్ల వంటి యాక్సెసరీలను కూడా 75 శాతం వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్‌లో దేశీయ విమానాల టికెట్లను బుక్ చేసుకుంటే రూ. 2,500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ. 25,000 వరకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి రెడ్మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సిరీస్ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్మీ నోట్ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఫోన ధరను షావోమి పెంచింది. మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి అప్పుడు రూ. 11,999లకే రెడ్మీ నోట్ 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది. రెడ్మీ నోట్ 10 ఫీచర్స్ నెట్వర్క్ టెక్నాలజీ : జీఎస్ఎం / హెచ్ఎస్పీఏ లాంచ్ డేట్ : మార్చి 4 డైమన్షన్ : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు) వెయిట్ : 178.8 గ్రాములు బిల్డ్ : ఫ్రంట్ గ్లాస్ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్ సిమ్ : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) డిస్ ప్లే : సూపర్ ఆమ్లోడ్, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్) సైజ్ : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో ) రిజల్యూషన్ :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఓఎస్ : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5 చిప్సెట్ : క్వాల్కామ్ SDM678 స్నాప్‌డ్రాగన్ 678 (11 nm) సీపీయూ : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్) జీపీయూ : అడ్రినో 612 మెమరీ కార్డ్ స్లాట్ : మైక్రో ఎస్డీఎక్స్సీ ఇంటర్నల్ : 64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్, 128జీబీ 6జీబీ ర్యామ్ క్వాడ్ : కెమెరా 48 ఎంపీ,ఎఫ్ /1.8, 26ఎంఎం సెల్ఫీ : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్/2.5 -
స్మార్ట్ ఫోన్ ధరలు దిగిరానున్నాయ్!
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.2000 కంటే కిందకి దిగిరానున్నాయ్. డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవ్వాలంటే రెండు వేలకే స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావాల్సి ఉందని భారత్ పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం వెంటనే ఆ చర్యలకు సిద్దమైంది. స్మార్ట్‌ఫోన్ ధరలు కచ్చితంగా రూ.2,000 కంటే తక్కువగా ఉండేలా వినియోగదారుల ముందుకు రావాలని స్థానిక హ్యాండ్సెట్ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్థిక లావాదేవీలను మరింత మందికి అందించాలని అభిప్రాయపడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్‌లు లభ్యం కానంత వరకు నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల నీతి ఆయోగ్ నిర్వహించిన భేటీలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అందించవచ్చని పేర్కొనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థలు, శాంసంగ్, ఆపిల్ లాంటి బహుళ జాతీయ దిగ్గజాలు ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు. 20 నుంచి 25 మిలియన్ల స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేలా హ్యాండ్సెట్ కంపెనీలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే ఆ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తోసిపుచ్చినట్టు ఇద్దరు అధికారులు పేర్కొన్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్, మంచి నైపుణ్యతతో తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం తమకు సవాళ్లేనని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం 3జీ స్మార్ట్ఫోన్లు రూ.2500 మధ్యలో లభ్యమవుతున్నప్పటికీ, 4జీ ఫోన్లు కొంచెం ధరెక్కువగానే పలుకుతున్నాయి. పెద్ద నోట్ల రద్దయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. -
డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ కీలకం
- డిజిటల్ పయనానికి పన్ను రాయితీలు ఉండాలి - డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ అమలు దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు రాయితీలు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీలు కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డిజిటల్ ఎకానమీకి వెళ్లాలంటే ఉత్తమ పద్ధతులు, ఇబ్బందులపై చర్చించాం. అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు అధ్యయనం చేస్తున్నాం. ఆధార్ ఆధారంగా చెల్లింపు చేసే పద్ధతి సులువైనది. వ్యాపారికి స్మార్ట్‌ఫోన్ ఉండి, దానికి బయోమెట్రిక్ పరికరం బిగిస్తే సరిపోతోంది. దీనికి రెండువేలు ఖర్చవుతుంది. ఏపీ రూ.1000 రాయితీ ఇస్తోంది. వినియోగదారుడికి ఎలాంటి ఖర్చు ఉండదు. త్వరలోనే దీన్ని ప్రారంభించాలి. రాష్ట్రంలో ఇప్పటికే పైలెట్‌గా 400 షాపుల్లో ప్రారంభించాం. చౌకధరల దుకాణాల్లో ఇప్పటికే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నాం. నాలుగు మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు. యూఎస్ఎస్డీ ద్వారా సాధారణ ఫోన్ నుంచి కూడా లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ద్వారా కూడా సులువుగా ఉంటుంది. 600 మిలియన్ సెల్ఫోన్లున్నాయి. వీటిద్వారా యూపీఐ విధానంలో సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఎన్పీసీఐ 33 బ్యాంకులను యూపీఐ కిందికి తెచ్చింది. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. స్వైపింగ్ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఇండియాకు సైబర్ సెక్యూరిటీలో ఉన్న సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు..’ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌లో జరిగిన కమిటీ సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్‌కాంత్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే వారంలో నివేదిక ‘నగదు రహిత లావాదేవీల అమలు విధానంపై సిఫారసులతో కూడిన మధ్యం తర నివేదికను జనవరి మొదటి వారంలో ప్రధానికి ఇవ్వబోతున్నాం. హార్డ్‌వేర్, ఈపాస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్య లున్నాయి. రానున్న 3 నెలల్లో 10 లక్షల ఈ పాస్ మిషన్లు దిగుమతి చేసుకోవాలని, దేశీయంగా 10 లక్షల మిషన్లు సేకరించాలని నిర్ణయించాం. స్మార్ట్ఫోన్ల ధరలు దిగి రావాలి. ప్రభుత్వం వీటికి రాయితీ ఇవ్వాలి. వీటన్నింటి వినియోగం ఖర్చుతో కూడినదై ఉండరాదు. బ్యాండ్‌విడ్త్ విస్తరించాలి. డేటా వేగం పెరగాలి. బ్యాంకర్ చార్జీలు, కమ్యూనికేషన్ చార్జీలు అతి తక్కువలో ఉండాలి. పన్ను తగ్గించాలి. పన్ను రాయితీ ఉంటేనే డిజిటల్ కరెన్సీకి పెద్ద ఎత్తున వెళతారు’ అని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దుపై తన వైఖరి ఎప్పుడూ మారలేదని, నగదు రహిత లావాదేవీలతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.